Anand Mahindra : మహీంద్రా SUV షోరూంలో రైతుకు ఘోర అవమానం.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్..!

కర్ణాటకలోని తమకూరు మహీంద్రా SUV షోరూంలో జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.

Anand Mahindra : మహీంద్రా SUV షోరూంలో రైతుకు ఘోర అవమానం.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్..!

Anand Mahindra's

Updated On : January 25, 2022 / 6:11 PM IST

Anand Mahindra : కర్ణాటకలోని తమకూరు మహీంద్రా SUV షోరూంలో జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ షోరూంలో రైతుకు జరిగిన అవమానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బొలెరో వాహనం కొనేందుకు ఓ రైతు, తన స్నేహితులతో కలిసి మహీంద్రా షోరూంకు వెళ్లాడు. వారి వేషధారణ చూసిన అక్కడి (Mahindra SUV showroom) షోరూంలోని సేల్స్ మ్యాన్ ఘోరంగా అవమానించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ ఘటనపై సీరియస్‌గా తీసుకున్నారు.

@MahindraRise ప్రధాన ఉద్దేశం.. కమ్యూనిటీలు, అన్ని వాటాదారుల్ని అభివృద్ధి చేయడమే.. వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడమేనన్నారు. తత్వశాస్త్రం ప్రకారం.. ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు సత్వరమే పరిష్కారం చూపడం జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు గిరిసొన్నాసెరీ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి ఓ వ్యక్తి రైతుకు జరిగిన అవమానం గురించి వార్త కథనాన్ని ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేశాడు. దానికి మహీంద్రా అండ్‌ మహీంద్రా సీఈవో విజయ్‌ నక్రా స్పందించారు.


కస్టమర్ సెంట్రిక్ అనుభవాన్ని అందించడంలో డీలర్‌లు అంతర్భాగమని తెలిపారు. మా కస్టమర్‌లందరినీ మేం ఎల్లప్పుడూ గౌరవిస్తామన్నారు. ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని విజయ్‌ నక్రా (Mahindra CEO Veejay Nakra) రీట్వీట్‌ చేశారు. ఆ రీట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా రియాక్ట్‌ అయ్యారు.


ఇటీవల.. బొలెరో పిక్-అప్ ట్రక్కును కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని Kempegowda  అనే రైతు షోరూమ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తనకు కారు కొనడం కష్టమని సేల్స్‌మ్యాన్ అవమానించాడు. ఆ రైతు సేల్స్ మ్యాన్ వ్యాఖ్యలకు ఛాలెంజ్ విసిరాడు. స్నేహం కోసం సినిమాలో మాదిరిగా.. ఒక గంటలో  రూ. 10లక్షల  నగదుతో షోరూంకు తిరిగి వచ్చాడు. ఈ ఘటనలో ఇరువురి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆ సేల్స్ మ్యాన్ రైతుకు క్షమాపణలు చెప్పాడు.


Read Also : Venkaiah Naidu : ఈసారి 75 శాతం ఓటింగ్ పెరగాలి.. ప్రతి ఒక్కరి బాధ్యత : ఉపరాష్ట్రపతి వెంకయ్య