ఆప్ ఎమ్మెల్యే నరేశ్ కాన్వాయ్ కాల్పుల ఘటనలో ఒకరు అరెస్ట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో పోలీసులువెంటనే స్పందించి ఒకరిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా సదరు వ్యక్తి..వ్యక్తిగత కక్షతోనే కాల్పులు జరిపినట్లుగా వెల్లడైంది.
బుధవారం (ఫిబ్రవరి 12,2020)న ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై జరిపిన కాల్పులకు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
కాగా..2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆప్ పార్టీ విజయోత్సాహంలో ఉంది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ ఘన విజయం తర్వాత ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ గుడికి వెళ్లి వస్తుండగా ఆయనను టార్గెట్ చేసిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు.