Army Dog
Army Dog: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ జాగిలం సాహసోపేతమైన పోరాటం చేసింది. ఉగ్రవాదుల జాడను గుర్తించే క్రమంలో జాగిలానికి రెండు తూటాలు తగిలినా లెక్కచేయకుండా బాధను దిగమింగుతూ ఆర్మీ అధికారులు తనకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆ జాగిలానికి శ్రీనగర్‌లోని సైనిక వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ జాగిలం ఆరోగ్యంగా, సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
MLA Seethakka: పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క.. డాక్టరేట్ ప్రదానం.. వీడియో
జమ్మూ-కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఆదివారం అర్థరాత్రి సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం ‘ఆపరేషన్ తంగపవ’ పేరుతో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు పూనుకున్నారు. అయితే ఉగ్రవాదులు కచ్చితంగా ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు కష్టంగా మారింది. దీంతో ఆర్మీ జాగిలం ‘జూమ్’ను రంగంలోకి దింపారు. అది నేరుగా ఉగ్రవాదుల అలికిడిని పసిగట్టి వారి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జూమ్ కు రెండు బులెట్లు తగిలాయి. అయినా అది బాధనుభరిస్తూ ఉగ్రవాదులను పారిపోకుండా చేసింది. దీంతో ఆర్మీ సిబ్బంది తనకు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే, ఆ ఇంట్లోని ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ బృందం మట్టుబెట్టింది. ఇందులో కీలక భూమిక పోషించింది మాత్రం జూమ్ మాత్రమే.
We wish Army assault dog 'Zoom' a speedy recovery. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/i1zJl0C2Gw
— Chinar Corps? – Indian Army (@ChinarcorpsIA) October 10, 2022
చినార్ కార్ప్స్ – ఇండియన్ ఆర్మీ పేరుపై ఉన్న ఖాతా నుంచి ఆర్మీ అధికారులు ట్వీట్ చేశారు. జూమ్ అత్యంత గొప్ప శిక్షణ పొందిన జాగిలం అని పేర్కొన్నారు. విధుల పట్ల అంకితభావం, నిబంద్ధతగల శునకమని, అత్యంత భీకరంగా దాడి చేయగలదని అన్నారు. దక్షిణ కశ్మీరులో అనేక ఆపరేషన్స్‌లో ఇది చురుగ్గా పాల్గొన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్టు చేసిన వీడియోలో జూమ్ శిక్షణ పొందుతున్న సమయంలో తీసిన దృశ్యాలను పొందుపర్చారు.