Jawan Beaten By Police : జవాన్‌ను బూటుకాళ్లతో తన్నిన పోలీసులు..
భారత ఆర్మీ జవానును పోలీసులు అత్యంత దారుణంగా బూటు కాళ్లతో తన్నిన ఘటనపై ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.దీంతో సదరు పోలీసులపై అధికారులు..

Army Jawan Beaten Up By Police Personnel
Army jawan beaten up by police personnel : భారతదేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే ఓ జవానుకు అవమానం జరిగింది. పోలీసులే జవాను బూటు కాళ్లతో తన్ని తీవ్రంగా అవమానించారు.మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ జవాన్‌ను జార్ఖండ్ పోలీసులు ఇష్టానురీతిగా బూట్లతో తన్నారు పోలీసులు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లాలో పోలీసులు మాస్క్ పెట్టుకోలేదని పవన్ కుమార్ యాదవ్ అనే జవాన్‌పై పోలీసులు దాడి చేశారు. బూట్లతో జవాన్ కడుపులో తన్నారు. కర్రలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓజవానుకు పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జార్ఖండ్ పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు పోలీసులతో పాటు మరో ఇద్దరు అధికారుల్ని డ్యూటీనుంచి తొలగించారు.
ఈ వీడియోలో..ఛాత్రాలోని కర్మా బజార్ ప్రాంతంలో పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఆరా-భూసాహి గ్రామానికి చెందిన జవాన్ యాదవ్ ఆ రూట్లో బైక్‌పై వచ్చాడు. దీంతో జవాన్ యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ లేకపోవడంతో నిలదీశారు. అతను సమాధానం చెప్పలోగానే అతడిని బండినుంచి దింపేశారు. బైక్ తాళాలు లాక్కున్నారు. అనంతరం కొంతమంది పోలీసులు జవాన్ ను రౌండప్ చేసి దారుణంగా చితకబాదారు. కడుపులో బూటుకాళ్లతోతన్నారు. కర్రలతో కొట్టారు. ఇష్టానురీతిగా దూషించారు.
కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏటంటే..మాస్క్ పెట్టుకోలేదని జవాన ను ప్రశ్నించి..దారుణంగా కొట్టిన పోలీసుల్లో కొంతమంది మాస్కులు పెట్టుకోకపోవటం. ఓ పోలీసు చర్య పట్ల ఆర్మీ జవాన్ నిరసన వ్యక్తం చేయటంతో పోలీసులు మరోసారి అతనిని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. దీంతో జవాన్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.
ఈక్రమంలో స్థానికులు జోక్యం చేసుకోవడంతో జవాను పవన్ కుమార్ యాదవ్‌ను మయూర్‌హండ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఛత్ర ఎస్పీ రాకేశ్ రంజన్ ఈ విషయం తెలుసుకుని విచరాణ జరిపించగా జవానును కొట్టటం నిజమేనని దారుణంగా వ్యవహరించినట్లుగా తేలింది. ఈ విషయాలను ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. దీంతో జవాన్ పై దాడికి పాల్పడిన ముగ్గురు పోలీసులతో పాటు మరో ఇద్దరు అధికారుల్ని డ్యూటీనుంచి తొలగించారు.
Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R
— VR (@vijayrampatrika) September 2, 2021