Guwahati
Guwahati : పనిలో పెట్టుకున్న మైనర్ బాలికను చిత్రహింసలు పెట్టినట్లు అసోంలోని ఆర్మీ అధికారి, అతని భార్యపై ఆరోపణలు వచ్చాయి. బాలిక మెడికల్ రిపోర్టులో ముక్కు పగిలినట్లు, నాలుకపై కోతలు ఉన్నాయని, ఎక్కువ సమయం ఆమె ఒంటిపై బట్టలు లేకుండా ఉంచారని పోలీసులు వెల్లడించారు.
Army Jawan: ఆర్మీ జవానుపై దుండగులు దాడి చేసి వీపుపై…
ఇండియన్ ఆర్మీలో మేజర్ హోదాలో ఉన్న అధికారి, అతని భార్య మైనర్ బాలికను బేబీ సిట్టింగ్ కోసం పనిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికను దంపతులిద్దరు చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆరు నెలల తర్వాత అసోం తిరిగి వచ్చిన బాలిక తన కుటుంబాన్ని కలిసాక తన అనుభవాలను బయటపెట్టడంతో దంపతుల దారుణాలు బయటపడ్డాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్మీ అధికారి, అతని భార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
Nepali Woman Killed : పెళ్లి చేసుకోవాలని అడిగిన నేపాలీ మహిళను హత్య చేసిన ఆర్మీ అధికారి
బాలికను వివస్త్రను చేసి రక్తస్రావం అయ్యేలా దంపతులిద్దరు కొట్టారని బాలిక పోలీసుల ముందు చెప్పింది. వారు పెట్టిన చిత్రహింసల్ని బాలిక పోలీసులకు వివరించింది. ఒంటి నిండా తీవ్ర గాయాలతో ఉన్న తమ బిడ్డను అసలు గుర్తు పట్టలేకపోయామని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే బాలిక మెట్లపై నుంచి పడిపోవడం వల్ల గాయాలయ్యాయని ఆర్మీ అధికారి, భార్య చెప్పారు. వీరిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.