Nepali Woman Killed : పెళ్లి చేసుకోవాలని అడిగిన నేపాలీ మహిళను హత్య చేసిన ఆర్మీ అధికారి

అయితే అప్పటికే అతనికి వివాహం అవడంతో డెహ్రాడూన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కిరాయికి తీసుకొని శ్రెయా శర్మను అందులో ఉంచాడు. ఇలా మూడేళ్లుగా ఆమె వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు.

Nepali Woman Killed : పెళ్లి చేసుకోవాలని అడిగిన నేపాలీ మహిళను హత్య చేసిన ఆర్మీ అధికారి

Nepali woman killed

Updated On : September 12, 2023 / 1:58 PM IST

Army Officer Killed Nepali Woman : ఉత్తరాఖండ్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోవాలని అడిగిన ఓ నేపాలీ మహిళను ఆర్మీ అధికారి హత్య చేశాడు. ఈ ఘటన డెహ్రాడూన్ లో చోటు చేసుకుంది. లెఫ్లినెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ మూడేళ్ల క్రితం క్లెమెంట్ టౌన్ కంటోన్మెంట్ ప్రాంతంలో విధులు నిర్వరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిలిగురిలోని ఓ బార్ లో డ్యాన్సర్ గా పని చేస్తున్న నేపాలీ మహిళ శ్రెయా శర్మ ఆయనకు పరిచయం ఏర్పడింది.

అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దికాలానికి ఆయనకు డెహ్రాడూన్ కు బదిలీ అయింది. దీంతో ఆమెను కూడా తనతో పాటే తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అతనికి వివాహం అవడంతో డెహ్రాడూన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కిరాయికి తీసుకొని శ్రెయా శర్మను అందులో ఉంచాడు. ఇలా మూడేళ్లుగా ఆమె వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు.

Shamshabad: శంషాబాద్ మహిళ హత్య కేసు.. ఆమెను తగులబెట్టింది మరో మహిళే.. ఎందుకంటే?

ఈ క్రమంలో తరచూ ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే గత శనివారం రాత్రి రాజ్పూర్ రోడ్డులోని ఓ క్లబ్ లో ఇద్దరూ కలిసి మందు తాగారు. అనంతరం ఆమెను తన కారులో లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లాడు. రాత్రి 1.30 గంటల సమయంలో థానో పట్టణం దాటిన తర్వాత నిర్మాణుష్య ప్రదేశంలో కారును ఆపాడు.

అనంతరం సుత్తెతో తలపై పలుమార్లు కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు.  దీంతో మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లెఫ్టినెంట్ కల్నల్ ఉపాధ్యాయ్ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.