Indian Army : రూ.6,500కోట్లతో 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు ఆర్మీ ఒప్పందం

భారతదేశ సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా టెండర్ పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా మన సైన్యానికి దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది....

artillery guns

Indian Army : భారతదేశ సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా టెండర్ పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా మన సైన్యానికి దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఆధునీకికరణ ప్రణాళికలో భాగంగా భారత సైన్యం త్వరలో 750 మిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకారం 400 కొత్త హోవిట్జర్స్ అనే ఫిరంగి ఆయుధాలను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది. (Procurement Of 400 Howitzers)

Asian Games : 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో భారత్‌ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం

దీనికోసం సైన్యం పూర్తిగా భారతీయ సంస్థలపై ఆధారపడుతుంది. ఆర్మీ దేశీయ సంస్థల నుంచి 400 హోవిట్జర్లను సేకరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రూ .6,500 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు భారత సైన్యం ఇప్పటికే 307 అధునాతనమైన ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.