Asian Games : 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో భారత్‌ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం

ఆసియా గేమ్స్ లో శుక్రవారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ పోటీల్లో భారత్‌ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం లభించింది. స్వాప్నిల్-ఐష్వరీ-అకుల్ త్రయం పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పి జట్టులో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది....

Asian Games : 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో భారత్‌ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం

Swapnil-Aishwary-Akhil

Asian Games : ఆసియా గేమ్స్ లో శుక్రవారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ పోటీల్లో భారత్‌ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం లభించింది. స్వాప్నిల్-ఐష్వరీ-అకుల్ త్రయం పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పి జట్టులో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. స్వాప్నిల్ కుసల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమార్, అఖిల్ షీరాన్ బంగారు పతకం సాధించడంతో హాంగ్‌జౌలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ షూటింగ్ బృందం ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. (Swapnil-Aishwary-Akhil Trio Bags Asian Games Gold)

 

ఆసియా క్రీడోత్సవాల్లో పతకాల పంట

ఆసియా క్రీడోత్సవాల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. 1769 పాయింట్ల స్కోరుతో, టీమ్ ఇండియా స్వర్ణం సాధించింది. ఏడు బంగారు, తొమ్మిది వెండి 11 కాంస్య పతకాలతో ఆసియా గేమ్స్ హాంగ్‌జౌలో భారతదేశం మొత్తం 27 పతకాలు సాధించింది. అంతకుముందు ఇషా సింగ్, పాలక్, దివ్య సుబ్బరాజు షూటింగ్ త్రయం శుక్రవారం కొనసాగుతున్న ఆసియా ఆటల్లో మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ పిస్టల్ టీం ఫైనల్‌లో రజత పతకం సాధించారు.

ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో ఈషాసింగ్‌కు రజత పతకం

ఆసియా గేమ్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో టీనేజ్ షూటర్ ఈషాసింగ్ శుక్రవారం రజత పతకం సాధించారు. ఇషా సింగ్ నేతృత్వంలోని భారతీయ జట్టు షూటింగ్‌లో ఆసియాడ్ సిల్వర్‌ను కైవసం చేసుకుంది. 18 ఏళ్ల ఈషా (579), పాలక్ (577), దివ్య టిఎస్ (575) త్రయం రజత పతకం కోసం 1731 పాయింట్లను సాధించింది. ఇషా సింగ్ నేతృత్వంలోని భారతీయ 10 మీ ఎయిర్ పిస్టల్ మహిళల జట్టు ఆసియా గేమ్‌షా వద్ద రజతం కైవసం చేసుకుంది. పలాక్ కూడా వ్యక్తిగత పతకాలు సాధించే అవకాశం ఉంది.