Mamata Banerjee: నన్ను కూడా అరెస్ట్ చేయండి – సీబీఐ ఆఫీసు ముందు మమతా

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలోని సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. నారదా బ్రైబరీ కేసులో ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ అనే ఇద్దరు మినిష్టర్లను అరెస్టు చేయడంతో ..

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలోని సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. నారదా బ్రైబరీ కేసులో ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ అనే ఇద్దరు మినిష్టర్లను అరెస్టు చేయడంతో ఆమె ఇలా స్పందించారు. ‘ఎటువంటి ప్రొసీజర్ లేకుండా వాళ్లను అరెస్టు చేశారు. సీబీఐ నన్ను కూడా అరెస్టు చేసుకోండి’ అని నిజాం ప్యాలెస్ లో ఉన్న సీబీఐ ప్యాలెస్ లో మాట్లాడారు.

తృణమూల్ పార్టీ కార్యకర్తలు బిల్డింగ్ బయట ఉండి నిరసన వ్యక్తం చేశారు. వారిలో కొందరు రాళ్లు రువ్వి ఆందోళన సృష్టించారు. ఇద్దరు మంత్రులతోపాటుగా ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్‌ సోవన్ ఛటర్జీని కూడా సీబీఐ కార్యాలయానికి తరలించింది.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను సీబీఐ అరెస్టు చేసిందంటూ ఫిర్హాద్ ఆరోపణలు చేశారు. వీటిని తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థ.. విచారణ నిమిత్తమే తీసుకెళ్లినట్లు తెలిపింది. గవర్నర్ జగదీప్‌ ధనకర్ అనుమతి మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు