Amazing artist : షాంపూతో శివుని చిత్రం.. ఈ ఆర్టిస్ట్ స్టైలే వేరు..

ఎవరినైనా ఊహిస్తూ వారి చిత్రం గీయడం ఎంతో కష్టమైన పని. ఆర్టిస్ట్‌లకు అది అందెవేసిన చేయి. ఓ ఆర్టిస్ట్ అందరిలా కాకుండా రకరకాల వస్తువులను ఉపయోగించి విభిన్నమైన చిత్రాలు గీస్తున్నాడు. ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా షాంపూతో అతను వేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Amazing artist

Amazing artist : కొంతమందిలో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. ఏ వస్తువుని చూసినా దానితో ఏదో ఒక కళాకృతులు చేసి అదరహో అనిపిస్తారు. షాంపూతో (shampoo) కూడా బొమ్మలు వేయచ్చు అనే ఆలోచన ఎంతమందికి వచ్చి ఉంటుంది. ఓ ఆర్టిస్ట్ కి (artist) వచ్చింది. రూపాయి షాంపు ప్యాకెట్లతో అతను వేసిన బొమ్మని చూస్తే అద్భుతం అనిపిస్తుంది.

Children’s Amazing Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు వీడియో వైరల్

కళాకారులకి వినూత్నమైన ఆలోచనలు వస్తుంటాయి. షింటూ మౌర్య (Shintu Mourya) అనే ఆర్టిస్ట్‌కి షాంపుతో బొమ్మగీయాలనే ఆలోచన వచ్చింది. అంతే తన టాలెంట్ ఉపయోగించి రూపాయి షాంపు ప్యాకెట్లు తీసుకుని అద్భుతమైన శివుని విగ్రహాన్ని (lord shiva) వేసేసాడు. ఈ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అప్ లోడ్ చేశాడు. మౌర్య ఇంతకు ముందు మెహందీ కోన్స్, లిప్ స్టిక్, రామ్ అని చేత్తో రాసిన అక్షరాలతో హనుమంతుడి చిత్రాన్ని ఇలా అబ్బురపరిచే ఎన్నో చిత్రాలు గీసాడు. తాజాగా షాంపుతో అతను గీసిన శివుడి చిత్రం  వైరల్ అవుతోంది.

Malegaon Court: వింతైన తీర్పు ఇచ్చిన మాలేగావ్ కోర్టు.. ముద్దాయి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలట

ఇక మౌర్య చిత్రాల్ని చూసి జనం ఫిదా అవుతున్నారు. ఇది గీయడం అంత సింపుల్ కాదు.. ఎంతో కష్టమైన పనిని అద్భుతంగా చేశాడని కొందరు.. అద్భుతం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఆర్టిస్ట్ మౌర్య అందరిలా కాకుండా విభిన్నమైన చిత్రాలు గీస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.