ఏడీఆర్ సర్వే: అరుణాచల్ అసెంబ్లీ పోటీలో నేర చరితులు  

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 10:47 AM IST
ఏడీఆర్ సర్వే: అరుణాచల్ అసెంబ్లీ పోటీలో నేర చరితులు  

Updated On : April 9, 2019 / 10:47 AM IST

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో 60 శాసనసభ స్థానాలున్నాయి. ఈ 60 స్థానాలకు ఆయా పార్టీల నుంచి మొత్తం 184 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Read Also : కేసీఆర్ ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకో : చంద్రబాబు

వీరిలో 29 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఈ నేరచరితుల్లో   9 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఏడుగురు బీజేపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నేరచరిత్ర కలిగిన లిస్ట్ లో ఉన్నారు. మిగతావారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులేనని ఏడీఆర్‌ వెల్లడించంది. కాగా 2014 ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వారు 6 శాతం మంది ఉండగా..2019లో ఇప్పుడు అది 16 శాతానికి చేరింది. 
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను