Arvind Kejriwal: మొన్న కేసీఆర్‌తో.. ఇప్పుడు అదే విషయంపై స్టాలిన్‌తో కేజ్రీవాల్..

చెన్నైకు వెళ్లిన కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు.

Arvind Kejriwal – Centres Ordinance: ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే హైదరాబాద్ (Hyderabad)కు వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పాలనా అధికారాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని, పార్లమెంటులో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కేసీఆర్ ను కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే. ఇవాళ ఇదే విషయంపై తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ (MK Stalin)ను కలిశారు కేజ్రీవాల్.

ఈ విషయాన్ని తెలుపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. చెన్నైకు వెళ్లిన కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఇతర నేతలు  కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, దీనికి వ్యతిరేకంగా పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని స్టాలిన్ ను కేజ్రీవాల్ కోరారు.

బీజేపీ రాజ్యాంగవిరుద్ధ, అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా తమకు మద్దతు తెలపాలని అన్నారు. సమాఖ్య విధానంపై బీజేపీ దాడి చేస్తోందని చెప్పారు. పార్లమెంటులో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ దేశంలోని పలు పార్టీల అధినేతలను కేజ్రీవాల్ కలుస్తున్నారు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను శుక్రవారం కేజ్రీవాల్ కలవనున్నారు. మరికొందరు నేతల అపాయింట్‌మెంట్ కూడా కేజ్రీవాల్ తీసుకున్నారు.

Telangana Formation Day 2023: కాంగ్రెస్ వేడుకలు… ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్

ట్రెండింగ్ వార్తలు