Telangana Formation Day 2023: కాంగ్రెస్ వేడుకలు… ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్

యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో పెప్పర్స్ స్ప్రే ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

Telangana Formation Day 2023: కాంగ్రెస్ వేడుకలు… ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్

Telangana Formation Day

Updated On : June 1, 2023 / 5:19 PM IST

Telangana Formation Day 2023 – Congress: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న హైదరాబాద్ (Hyderabad)లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ వేడుకలు నిర్వహించనుంది. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ (Meira Kumar) పాల్గొననున్నారు.

యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను సన్మానిస్తారు.

Telangana Formation Day 2023: జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ర్యాలీలు.. ఇంకా