Aryan Khan Bail Petition : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్..ఉత్కంఠ కంటిన్యూ

ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన్ ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది బాంబే హైకోర్టు.

Aryan Khan Bail Petition : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్..ఉత్కంఠ కంటిన్యూ

Aryan Khan

Updated On : October 26, 2021 / 6:59 PM IST

Aryan Khan Bail Petition : ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన్ ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది బాంబే హైకోర్టు. 2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ వాయిదా వేసింది. అయితే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ (NCB) వాదించింది. ఆర్యన్‌కు బెయిల్ వస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని కోర్టుకు తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి షారుఖ్ ఖాన్ మేనేజర్.. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని కూడా ఆరోపించారు.

విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రత్యక్ష సాక్ష్యులతో మాట్లాడి కేసును తప్పుదోవ పట్టించినట్లు చూశారని కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని ఎన్సీబీ వాదించింది. మరోవైపు ఆర్యన్ అమాయకుడంటూ ఆయన తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అసలు ఈకేసులో ఆర్యన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు రోహత్గీ.

షిప్‌లో ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఆర్యన్‌కు డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించలేదున్నారు. ఇక ఆర్యన్ ఖాన్‌ ఫోన్‌లోని చాట్‌ 2018లో జరిపినవిగా రోహత్గీ కోర్టుకు తెలిపారు. అసలు ఆర్యన్‌పై సెక్షన్ 37 కింద పెట్టిన కేసులు కుదరవన్నారు. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. విచారణను 2021, అక్టోబర్ 27వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది. మరి ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా ? లేదా ? అనేది తేలనుంది.