Aryan Khan : నేడు జైలు నుంచి విడుదల కానున్న ఆర్యన్

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ ఇంట్లో.. ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది. క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Aryan Khan : నేడు జైలు నుంచి విడుదల కానున్న ఆర్యన్

Aryan Khan (1)

Updated On : October 30, 2021 / 8:12 AM IST

cruise ship drug case : బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ ఇంట్లో.. ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది. క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఉదయమే జైలు అధికారులు ఆర్యన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్యన్‌ కేసు బెయిల్‌ పిటిషన్‌పై పూర్తిస్థాయి కోర్టు ఆర్డర్‌ వెలువడిన తర్వాతే విడుదల కానున్నారు. ఆర్యన్‌ఖాన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలు కూడా విడుదలై బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదే విషయాన్ని ఆర్యన్‌ తరఫు లాయర్‌ మాజీ అటార్నీ జనరల్ ముకుల్‌ రోహత్గీ తెలిపారు. ఆర్యన్‌ ఖాన్‌ బెయిలు కోసం బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా సంతకం చేశారు. అయితే ఆర్యన్‌ఖాన్ బెయిల్‌ అయితే జారీ చేశాం కానీ.. కండిషన్స్‌ అప్లై అంటోంది బాంబే హైకోర్టు.. ఆర్యన్‌ బెయిల్‌కు సంబంధించి అనేక కండిషన్‌లను కోర్టు ముందు ఉంచింది నార్కోటిక్స్‌ కంటోల్‌ బ్యూరో.. అర్యన్‌ బెయిల్‌ కోసం 14 షరతులు విధించినట్లు తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.! _ Big Twist in Aryan Khan Case _ Sameer Wankhede

పోలీసులకు చెప్పకుండా ముంబై విడిచి వెళ్లరాదని షరతు పెట్టింది. ఆర్యన్ లక్ష రూపాయల పర్సనల్‌ బాండ్‌ రాసివ్వాల్సి ఉంది. అయితే కోర్టు ఆర్డర్‌లో వీటన్నింటిని యథాతథంగా లేదా కొన్నింటిని బెయిల్‌ ఆర్డర్‌లో ఉంచనుంది ముంబై హైకోర్టు. బెయిల్ రాగానే స్పెషల్‌ కోర్టు ముందు అతని పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ఏదైనా అత్యవసరమైతే తప్ప ఆర్యన్‌ స్పెషల్‌ జడ్జ్‌ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఎన్సీబీ కోర్టును కోరింది..

ఈ కేసుకు సంబంధించి ఆర్యన్‌ఖాన్‌ మీడియాతో కానీ, సోషల్‌ మీడియాలో కానీ మాట్లాడకూడదు. ఇక ఈ కేసుతో సంబంధంమున్న వ్యక్తులు, తోటి నిందితులతో కలవకూడదని… కనీసం కాల్స్‌ కూడా చేసుకోవద్దని సూచించింది.. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటిని చేయకూడదని.. అలా చేసినట్టు తెలిస్తే అతని బెయిల్‌ వెంటనే రద్దు కానుంది. ఇక ఎన్సీబీ ఎప్పుడు పిలిచినా.. ఆర్యన్‌ ఖాన్‌ దర్యాప్తుకు హాజరు కావాల్సి ఉంటుంది.