Gehlot slams Azad: ఆ టైంలో సైకో అనే వాళ్లు: గులాం నబీపై మండిపడ్డ గెహ్లోత్

73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్‌ అపరిపక్వ నాయకత్వాన్ని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.

Gehlot slams Azad: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‭పై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్ గాంధీ సమయంలో ఆయనను సైకో అని పిలిచేవారంటూ దుయ్యబట్టారు. సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్న సమయంలో ఇలాంటి లేఖలు ఆమెకు రాయడం ఏంటి? ఏ ఉద్దేశంతో తన రాజీనామా లేఖను సోనియాకు పంపారంటూ గెహ్లోత్ విమర్శించారు.

‘‘అనారోగ్యం కారణంగా సోనియా అమెరికాకు వెళ్లారు. ఈ సమయంలో మీరు (ఆజాద్) లేఖలు రాసి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? 1996లో మా ఒత్తిడి వల్ల ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రస్తుతం ఆమె ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకోకుండా లేఖలు రాయడం మానవ మనోభావాల్ని దెబ్బతీయడమనే నేను అనుకుంటున్నాను’’ అని గెహ్లోత్ అన్నారు.

TS ICET 2022: రేపే తెలంగాణ ఐసెట్-2022 ఫలితాలు విడుదల

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పని చేసిన ఆజాద్.. జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్న నేత. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే జమ్మూ కశ్మీర్ వరకే పరిమితమైపోతారా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. అయితే సొంత పార్టీపై బహిరంగ ప్రకటనేదీ చేయని ఆజాద్.. ఒక ప్రముఖ పత్రికకు చెందిన విలేకరితో మాత్రం ‘‘ప్రస్తుతం అయితే నా సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్‭లో పార్టీ పెడతాను. జాతీయ రాజకీయాలపై తర్వాత ఆలోచిస్తాను’’ అని అన్నట్లు సమాచారం.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్‌ అపరిపక్వ నాయకత్వాన్ని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.

Drug test: డ్రగ్స్ టెస్టులో విఫలం.. పైలట్‌ను విధుల్లోంచి తొలగించిన డీజీసీఏ

ట్రెండింగ్ వార్తలు