Confidence Motion: బీజేపీకి చెక్ పెట్టేందుకు బలపరీక్షకు సిద్ధమైన కేజ్రీవాల్

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు కూలిపోవడం.. వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అన్ని ప్రభుత్వాల్ని హత్య చేసుకుంటూ వస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇప్పటివరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సీరియల్ కిల్లర్‌లా వరుస ఖూనీలు చేస్తోందని మండిపడ్డారు

Confidence Motion: బీజేపీకి చెక్ పెట్టేందుకు బలపరీక్షకు సిద్ధమైన కేజ్రీవాల్

India's first virtual school

Confidence Motion: తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందంటూ కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఎట్టకేలకు బీజేపీకి చెక్ పెట్టేందుకు బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల్ ఫెయిలైందని నిరూపించడానికి తాను ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష ఎదుర్కోనున్నారు కేజ్రీవాల్.

దీనికి కొద్ది గంటల ముందు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ సీరియల్ కిల్లర్ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు కూలిపోవడం.. వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అన్ని ప్రభుత్వాల్ని హత్య చేసుకుంటూ వస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇప్పటివరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సీరియల్ కిల్లర్‌లా వరుస ఖూనీలు చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ తమపై తప్పుడు కేసులు పెడుతూనే ఉంటుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.

Fake Universities List: ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసిన యూజీసీ.. జాబితాలో ఏపీ యూనివర్సిటీ

‘‘బీజేపీ కొన్ని ప్రభుత్వాలను విజయవంతంగా కూలదోసి ఇప్పుడు ఢిల్లీవైపుకు కదిలింది. దేశంలో ప్రభుత్వాన్ని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ. అంతటా ఒకటే విధమైన హత్య’’ అని కేజ్రీవాల్ అన్నారు. అలాగే గడిచిన కొద్ది సంవత్సారల్లో మొత్తంగా 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. కానీ ఢిల్లీలో చేపట్టిన ఆపరేషన్ లోటస్ ఫెయిలై ఆపరేషన్ కీచడ్ (మట్టి) అయిందని ఎద్దేవా చేశారు.

దీనికి రెండ్రోజుల ముందు ఆప్‭కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల చొప్పున లక్కలు కూడా వేసి పెట్టుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వద్ద చాలా డబ్బు ఉంటుందని, అయితే ప్రజల అవసరాలు తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా ఉండదని, తాము ప్రజల అవసరాలు తీరుస్తుంటే రేవ్డీ అంటూ హేళన చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు.

Sonali Phogat Death Case : గుండెపోటుతో చనిపోలేదు.. నటి సోనాలి ఫోగట్ మృతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన గోవా పోలీసులు