Sonali Phogat Death Case : గుండెపోటుతో చనిపోలేదు.. నటి సోనాలి ఫోగట్ మృతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన గోవా పోలీసులు

హర్యానా బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతి కేసులో గోవా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. సోనాలికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో ఆమె చనిపోలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. నిందితులు సోనాలికి డ్రింక్స్ ద్వారా అబ్ నాక్సియస్ కెమికల్ ఇచ్చారని గుర్తించారు. సోనాలి హత్య వెనుక ఆర్థికపరమైన కారణాలు ఉండి ఉండొచ్చని గోవా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Sonali Phogat Death Case : గుండెపోటుతో చనిపోలేదు.. నటి సోనాలి ఫోగట్ మృతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన గోవా పోలీసులు

Sonali Phogat Death Case : హర్యానా బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతి కేసులో గోవా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. సోనాలికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో ఆమె చనిపోలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. నిందితులు సోనాలికి డ్రింక్స్ ద్వారా అబ్ నాక్సియస్ కెమికల్ ఇచ్చారని గుర్తించారు. సోనాలి హత్య వెనుక ఆర్థికపరమైన కారణాలు ఉండి ఉండొచ్చని గోవా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఓ పార్టీలో సోనాలికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని, కంట్రోల్ తప్పడంతో సోనాలిని వాష్ రూమ్ కి తీసుకెళ్లారని, దాదాపు రెండు గంటలకుపైగా అక్కడే తచ్చాడారని పోలీసులు గుర్తించారు. క్లబ్ నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సోనాలి సన్నిహితుడు సుఖ్విందర్ వాసీ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Sonali Phogat: సోనాలి ఫోగట్ ఒంటిపై గాయాలు.. పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడి

బీజేపీ నేత సోనాలి ఫొగట్ గోవాలో గుండెపోటుతో మరణించిందని తొలుత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆమె హార్ట్ ఎటాక్‌తో చనిపోలేదు.. హత్య అని గోవా మెడికల్ కాలేజీ డాక్టర్ల ప్యానెల్ నిర్వహించిన పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆమెతో పాటు గోవా వచ్చిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంలో ఆమె శరీరంపై కమిలిన గాయాలను గుర్తించారు. సోనాలి మంగళవారం ఉదయం చనిపోగా.. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు.

ఫొగట్ పీఏ సుధీర్ సాంగ్వాన్, ఆమె స్నేహితుడు సుఖ్విందర్ వాసీలపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Sanitiser Foils Cheating: రైల్వే ఎగ్జామ్ కోసం తన బొటనవేలి తోలు తొలగించి ఫ్రెండ్‭కు అతికించిన అభ్యర్థి.. ఈ తర్వాత ఏమైందంటే..?

గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ లో సోనాలి ఫోగట్ సోదరుడు రింకూ ధాకా ఫిర్యాదు మేరకు సుధీర్ సాంగ్వాన్, సుఖ్విందర్ వాసీని గోవా పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఐపీసీ సెక్షన్ 302(హత్య)కింద కేసు నమోదు చేశారు. మరణానికి కాసేపటి ముందు సోనాలి తన తల్లి, సోదరి, బావమరిదితో మాట్లాడారని ఆమె సోదరుడు ధాకా ఆరోపించారు. సంభాషణ సమయంలో ఆమె డిస్ట్రర్బ్ అయిందని, ఆమె తన ఇద్దరు కొలీగ్స్ గురించి కంప్లెయింట్ చేసిందని ధాకా తెలిపారు. మూడేళ్ల క్రితం సోనాలి ఫోగట్ సహాయకుల్లో ఒకరు ఆమె తినే ఆహారంలో మత్తు పదార్థం కలిపి ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడని ధాకా తన ఫిర్యాదులో తెలిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గోవా టూర్‌ కి వెళ్లిన సోనాలి ఫోగట్ సోమవారం(ఆగస్టు 22) రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మరణించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర గోవాలోని ఎస్టీ ఆంటోనీ ఆస్పత్రి నుంచి సోనాలి ఫోగట్ మృతి గురించి ఆగస్టు 23న పోలీసులకు సమాచారం అందింది.