COVID-19 Vaccine: అస్సాంలో 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత వ్యాక్సిన్

అస్సాం 18-45ఏళ్లు మధ్యనున్న ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రెడీ..

COVID-19 Vaccine: అస్సాంలో 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత వ్యాక్సిన్

Corona Vaccine

Updated On : April 21, 2021 / 10:51 AM IST

COVID-19 Vaccine: అస్సాం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 18ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ మే1 నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా కోటి వ్యాక్సిన్ డోసులను సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయనున్నట్లు తెలిపింది.

అస్సాం హెల్త్ మినిష్టర్ హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. అస్సాం 18-45ఏళ్లు మధ్యనున్న ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. అస్సాం ఆరోగ్య నిధిలో గతేడాది వ్యాక్సిన్ లు అందుకునే క్రమంలో నిధులు సేకరించారు. ఈ రోజే (మంగళవారం) భారత్ బయోటెక్ నుంచి కోటి డోసులను ఆర్డర్ చేశాం.

భారత్ బయోటెక్ కు రాసిన లెటర్లో కేంద్రం సాధ్యమైనంత వరకూ ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలని చేపట్టిన ప్రోగ్రాంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం ఫిక్స్ చేసినట్లుగానే స్టేట్ గవర్నమెంట్ కొవాగ్జిన్ డోసులను కోటి ఆర్డర్ చేసింది.

స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్, అస్సాం 79లక్షల 63వేల 421శాంపుల్స్ సేకరించి పరీక్షలు పూర్తి చేసింది. మంగళవారం నాటికి రాష్ట్రంలో తొలి కొవిడ్ వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వారు 14లక్షల 3వేల 293మంది ఉన్నారు. రెండో డోస్ వేసుకున్న వారు 3లక్షల 49వే 310 ఉండగా మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన వాళ్లు 17లక్షల 52వేల 603మంది అని రికార్డులు చెబుతున్నాయి.