మొదటి పదేళ్లు బదిలీల్లేవు, ఉపాధ్యాయుల కోసం అసోం ప్రత్యేక చట్టం

  • Publish Date - March 5, 2020 / 02:48 AM IST

ఉపాధ్యాయుల కోసం అసోం ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మొదటి పదేళ్లు ఒకే చోట పనిచేసేలా..ఆ తర్వాతే..వారికి బదిలీ అవకాశం కల్పించే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు 2020, మార్చి 04వ తేదీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హిమంత మాట్లాడుతూ…

ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయ బదిలీలు ఒక ప్రహసనంలా మారాయిన, పలుకుబడి ఉన్న వారు తమకు తెలిసిన అధికారుల ద్వారా కావాల్సిన చోటికి బదిలీ చేయించుకుంటున్నారని సభకు తెలిపారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే..కొత్త చట్టం రావాల్సిందేనని స్పష్టం చేశారు. 

చట్టం ప్రకారం…కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు..కనీసం పదేళ్ల పాటు బదిలీకి అనర్హులవుతారు. దీనిని అతిక్రమించి..బదిలీ పొందినట్లయితే..వారితో పాటు, వారిని ట్రాన్సఫర్ చేసిన అధికారి సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించారు. కనీసం వీరికి మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. ఒకే చోట పదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ చేసుకొనేందుకు ఆన్ లైన్ సేవలను తీసుకొస్తామన్నారు. పరస్పర బదిలీలకు పదేళ్ల నిబంధన వర్తించదని, ప్రభుత్వం తీసుకొచ్చే ఈ కొత్త చట్టానికి అన్ని పక్షలు మద్దతివ్వడం విశేషం. 

Read More : Kapil Sharma Talk Show : 33 ఏళ్ల తర్వాత సీత, రామ, లక్ష్మణ