Assam Police: వైరల్ వీడియో కోసం యత్నిస్తూ.. క్షతగాత్రుణ్ని కొట్టిన వీడియోగ్రాఫర్ 

గొడవల్లో కిందపడిపోయిన వ్యక్తిని కాపాడటానికి బదులు.. అతని వీడియో తీస్తూ నిల్చొన్న ఫొటోగ్రాఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని ఢోల్పూర్ గోరుఖుతీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Assam Police: వైరల్ వీడియో కోసం యత్నిస్తూ.. క్షతగాత్రుణ్ని కొట్టిన వీడియోగ్రాఫర్ 

Assam Police

Updated On : September 24, 2021 / 10:57 AM IST
Assam Police: గొడవల్లో కిందపడిపోయిన వ్యక్తిని కాపాడటానికి బదులు.. అతని వీడియో తీస్తూ నిల్చొన్న ఫొటోగ్రాఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని ఢోల్పూర్ గోరుఖుతీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బిజయ్ శంకర్ బనియా అనే వ్యక్తి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఆందోళనకారులను తొలగించాలని జిల్లా అడ్మినిష్ట్రేషన్ భావించింది.
కొందరు ఆందోళనకారులు ప్రభుత్వాధికారులపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు ఫైరింగ్ చేయడం మొదలుపెట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో పదిమంది వరకూ గాయాలకు గురయ్యారని దరంగ్ ఎస్పీ సుషాంత్ బిశ్వ శర్మ చెప్పారు.
ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని భావించిన ఫొటోగ్రాఫర్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలో చెట్ల వెనుక నుంచి టార్గెట్ కనిపించకపోయినా కాల్పులు జరుపుతున్నట్లుగా ఉంది. ఆందోళనకారుడ్ని పోలీసులు చుట్టుముట్టేంత వరకూ ఫొటోగ్రాఫర్ అతనితోనే ఉన్నాడు. ఆ తర్వాత గాయాలతో కిందపడిపోయిన మరో వ్యక్తి దగ్గరకు వెళ్లి కొట్టి… అతను కాస్త స్పృహలోకి రాగానే వీడియో తీస్తూ ఉన్నాడు.
ఇదంతా చూస్తున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని వీడియో కోసం కొట్టాడని అరెస్ట్ చేశారు.