Viral letters : దాని వల్ల..మాకిష్టమైనవి తినలేకపోతున్నాం అంటూ.. సీఎం,సీఎంలకు ఇద్దరు చిన్నారుల లేఖలు..

అస్సాంకు చెందిన ఇద్దరు చిన్నారులు ప్రధాని మోడీకి, అస్సాం సీఎం హిమంత్ బిస్వాలకు తమ సమస్య గురించి రాసిన లేఖలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ లేఖలో వారు ఏం రాసారంటే..

Viral Letters

Assam siblings write adorable letters Pm and Cm : అసోం చెందిర ఇద్దరు చిన్నారులు ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిస్వాతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆరు సంవత్సరాల అక్క..ఐదు సంవత్సరాల తమ్ముడు కలిసి రాసిన లెటర్ చదివిన అధికారులు షాక్ అయ్యారు. ఆసక్తి కలిగించే ఈ లెటర్ లో ఏమని రాశారంటే..

ఆరేళ్ల రవ్జా, ఐదేళ్ల తమ్ముడు ఆర్యన్ కలిసి పీఎం, సీఎంలకు విడివిడిగా లేఖలు రాస్తూ..మా వయసువారి దంత సమస్యల గురించి లేఖలో ఫిర్యాదు చేశారు. దంత సమస్యల కారణంగా తాము తమకు ఇష్టమైన పదార్థాలను నమిలి తినలేకపోతున్నామని ఆ చిన్నారులు రాసుకొచ్చారు.

తమ వయసులో ఉన్నవారికి దంతాలు ఊడిపోయాక, తిరిగి అవి వచ్చేందుకు చాలా సమయం పడుతోంది సార్..దంతాలు ఊడిపోవటం వల్ల మేం ఆహారం తినటానికి చాలా ఇబ్బందిగా ఉంది..దేశంలోని ప్రముఖ నేతలకు ఈ సమస్య గురించి తెలియజేయాలని నిర్ణయించుకున్నామని రాసుకొచ్చారు.

Read more : viral letter : మా ఊరికి రోడ్డు వేయిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా..ప్రధానితో పాటు CMకు యువతి లెటర్

ఈ చిన్నారులిద్దరు రాసిన ఈ లెటర్లను వారి మామ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయటంతో అవికాస్తా వైరల్‌గామారాయి. అది తెలుసుకున్న నెటిజన్లు భలే గడుగ్గాయిలే భలే రాసారు లెటర్లు అంటున్నారు. ఈ పోస్టు చేసిన వారి మామ… ‘హిమంత్ బిశ్వా శర్మ, నరేంద్ర మోదీలను ఉద్దేశిస్తూ… నా మేనకోడలు రవ్జా, మేనల్లుడు ఆర్యన్‌లు స్వయంగా ఈ లేఖ రాశారు.

ఈ లేఖలపై వారి మామ మాట్లాడుతు..నేనేమీ వారికి చెప్పలేదు..నేను ఇంటికి రాగానే మామా మామా చూడు ఈలెటర్లు అంటూ నా చేతిలో పెట్టారు. అవి చదివి నేను ఆశ్చర్యపోయాను. కానీ చాలా ముచ్చటగా అనిపించింది. అందుకే వీటిని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనిపించి సరదగా పోస్ట్ చేశాను అని తెలిపాడు.వారి దంత సమస్యలను పరిష్కరించండి. వారు వారికి ఇష్టమైనవేవీ తినలేకపోతున్నారు’ అని రాశారు అని చెప్పుకొచ్చారు.

Read more : viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

కాగా ఇటీవల ప్రధానికి, సీఎం లకు, ప్రజాప్రతినిధులకు లెటర్లు రాయటం అవి వైరల్ గా మారటం గురించి తెలిసిందే. ఓ యువకుడు తనకు పెళ్లి వయస్సు దాటిపోతోంది. నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి..నా ప్రాంతంలో ఏ అమ్మాయి నాకు పడటం లేదు..కాబట్టి నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసి పెట్టండి అంటే ఎమ్మెల్యేకు లెటర్ రాయటం అది వైరల్ కావటం జరిగింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు చిన్నారుల అమాయకపు సమస్య లెటర్ కూడా వైరల్ గా మారింది.