viral letter : మా ఊరికి రోడ్డు వేయిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా..ప్రధానితో పాటు CMకు యువతి లెటర్

మా గ్రామానికి రోడ్లు వేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే చేసుకోను అంటూ ఓ యువతి ప్రధాని మోడీకి..రాష్ట్ర సీఎంలకు లెటర్ రాసింది.ఈ లెటర్ వైరల్ కావటంతో అధికార యంత్రాంగం కదలివచ్చింది

viral letter : మా ఊరికి రోడ్డు వేయిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా..ప్రధానితో పాటు CMకు యువతి లెటర్

New Project (1)

Karnataka yong girl viral letter : అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే..అబ్బాయికి చెడు అలవాట్లు ఉండకూడదు. అబ్బాయి అందంగా ఉండాలి. ఉద్యోగం ఉండాలి అని ఆలోచిస్తారు. తనను బాగా చూసుకోవాలని ఆశపడతారు. కానీ ఓ యువతి మాత్రం అందరి అమ్మాయిలకంటే భిన్నంగా ఆలోచించింది. తన గురించి కాకుండా తన గ్రామం గురించి ఆలోచింది. గత కొన్ని దశాబ్దాలుగా తమ ఊరికి ఎంతోమంది నాయకులు వచ్చారు. ఓట్లు అడిగారు. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ ఊరి సంగతే మరచిపోయారు. కానీ ఆమె మరచిపోలేదు. తమ గ్రామం ఎలాగైనా బాగు పడాలని ఆలోచించింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ పెళ్లికాని అమ్మాయి.

Read more:ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

దాని కోసం ఆ అమ్మాయి ప్రధాని నరేంద్ర మోదీకి..తమ రాష్ట్ర సీఎంలకు ఓ లెటర్ రాసింది. ఏమనంటే..నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..కానీ నేను పెళ్లి చేసుకోవాలి అంటే మీరు ఓ పనిచేయాలి. కనీసం రోడ్లు లేక నానా కష్టాలు పడుతున్న మా కష్టాల గురించి ఆలోచించాలి. మా ఊరికి రోడ్డు వేస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని లేదంటే పెళ్లే చేసుకోను అని స్పష్టం చేస్తూ ప్రధాని మోదీతో పాటు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాసింది ‘బిందుశ్రీ’ అనే యువతి.ఈ సంచలన లేఖరాసిన ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలన్నా..ఆ గ్రామం గురించి తెలుసుకోవాలన్నా..కర్ణాటకలోనే దావణగెరె జిల్లాలోని మాయకొండ హోబళి ప్రాంతంలోని హెచ్ రాంపూర్‌కు వెళ్లాల్సిందే..హెచ్‌ రాంపుర గ్రామానికి చెందిన బిందుశ్రీ. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది.

ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో కనీసం బస్సు సదుపాయం లేదు. ఇక వానచినుకు పడిందంటే ఆ గ్రామస్తుల పాట్లు వర్ణనాతీతం. ఊరంతా మట్టిరోడ్లే. అడుగుకో గుంత. ఇక వాన పడిందా.. గ్రామస్తులు నరకం చూడాల్సిందే.
హిడ్నే గ్రామం నుంచి హెచ్‌ రాంపూర్‌కు వెళ్లే దాదాపు 2 కిలోమీటర్ల రహదారి.. నరకానికి రహదారిగా ఉంటుంది. అయినా ఏ నాయకుడు ఏ అధికారి పట్టించుకున్నా పాపాన పోలేదు.కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఆ గ్రామం గుర్తుకొస్తుంది నాయకులకు. దీంతో గ్రామస్తులు కష్టాలు వినేవాడే కరవయ్యాడు.

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

గ్రామం అంతా సమస్యల నియలంగా మారింది.ఈ పరిస్థితుల్లో విద్యార్ధులు స్కూళ్లు కూడా మానేస్తున్నారు. ఈ గ్రామంలో యువత పరిస్థితి ఎలా ఉందంటే..ఈ గ్రామానికి రోడ్లు లేనందు వల్ల యువతులకు గానీ..యువకులకు గానీ పెళ్లి సంబంధాలే రావటంలేదు. అదే విషయాన్ని బిందుశ్రీ లేఖలో పేర్కొంది. ఇది కేవలం నా పెళ్లి సమస్య మాత్రమే కాదని..విద్యార్ధులు బడి మానేయటానికి..గ్రామంలో ఎవరైనా చావు బతుకుల్లో ఉన్నా..గర్భిణిలు ప్రసవం నొప్పులతో బాధపడుతున్నా హాస్పిటల్ కు వెళ్లాలంటే అంబులెన్స్ రాని దుర్భర పరిస్థితులున్నాయనీ తమ గ్రామం సమస్యలన్నీ ప్రధాని మోడీకి రాష్ట్ర సీఎంకు రాసిని లెటర్ లో పేర్కొంది. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లా కలెక్టర్ మహంతేశ్‌ బీళగి రంగంలోకి దిగారు. రాంపుర గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించాడు.

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

యవతి కుటుంబంతో సైతం చర్చలు జరిపారు. సమస్యలు ఏవైనా పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. గ్రామ సమస్యల్ని మేం పరిష్కరిస్తాం నువ్వు పెళ్లి చేసుకోవాలని సూచించారు. కానీ గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేకే వివాహం చేసుకుంటానని ఆ వివాహానికి మిమ్మల్ని కూడా పిలుస్తానని తెగేసి చెప్పింది బిందుశ్రీ. దీంతో గ్రామంలో రోడ్ల నిర్మాణానికి పూనుకున్నారు అధికారులు. గ్రామానికి రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు.