teacher hair Cut students
Assam teacher hair Cut 30 students : అస్సాంలోని మజూలి జిల్లాలో ఓ స్కూల్లో టీచర్ 30మంది విద్యార్ధుల జుట్టు కత్తించారు. దీంతో విద్యార్థులంతా ఏడ్చుకుంటు ఇంటికెళ్లటంతో విషయం తెలిసిన తల్లిదండ్రులు స్కూలు వచ్చి ప్రశ్నించారు. దానికి సదరు టీచర్ విద్యార్ధులు క్రమశిక్షణగా ఉండాలి అందుకే జుట్టు కత్తిరించాం అని చెప్పారు.
అసోంలోని మజూలి జిల్లాలోని బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన స్కూల్లో జరిగిందీ ఘటన. ప్రతీ రోజలు వలెనే స్కూల్లో ప్రార్థనా సమయం జరుగుతోంది. అదే సమయంలో ఓ టీచర్ హెయిర్ కట్టర్ పట్టుకొచ్చి 30 మంది విద్యార్థులను వరుసగా నిలబెట్టి వారి జుట్టు కత్తిరించారు. పిల్లలు ఏడుస్తున్నా వినిపించుకోకుండా 30మంది పిల్లలకు జుట్టు కత్తిరించారు.
Teacher cuts students’ hair: పాఠశాలలో 50 మంది విద్యార్థుల తల వెంట్రుకలు కట్ చేసిన టీచర్
దీంతో పిల్లలంతా స్కూల్ వదిలాక ఏడుస్తు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. పలువురు తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి ప్రిన్సిపల్ ను ప్రశ్నించారు. విద్యార్థులు స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పొడవాటి జుట్టు పెంచుకున్నారు. జుట్లు కట్ చేయించుకోవాలని చాలాసార్లు వచెప్పాం. కానీ ఎవ్వరు పాటించలేదు.విద్యార్ధులు క్రమశిక్షణతో ఉండాలి..అందుకే కట్ చేశాం అని చెప్పారు. విద్యార్ధులకు క్రమశిక్షణ గురించి తెలియజేయటానికే ఇలా చేశాం అని చెప్పారు.
దానికి తల్లితండ్రులు పిల్లలకు క్రమశిక్షణ గురించి చెప్పాలంటే చాలా మార్గాలున్నాయి కానీ ఇలా జుట్టు కట్ చేయటం ఏంటీ? అని ప్రశ్నించారు. జుట్ కట్ చేసిన పిల్లలు స్కూల్ కు వెళ్లం అని ఏడుస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ కావేరీ బీ శర్మ ఆదేశించారు.