Teacher cuts students’ hair: పాఠశాలలో 50 మంది విద్యార్థుల తల వెంట్రుకలు కట్ చేసిన టీచర్
ఓ పాఠశాలలో విద్యార్థుల తల వెంట్రుకలు కట్ చేశాడు ఓ ఉపాధ్యాయుడు. దీంతో తమ అనుమతి తీసుకోకుండా తమ పిల్లల తల వెంట్రుకలను కట్ చేయడం ఏంటంటూ ఆ టీచర్ పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Teacher cuts students’ hair: ఓ పాఠశాలలో విద్యార్థుల తల వెంట్రుకలు కట్ చేశాడు ఓ ఉపాధ్యాయుడు. దీంతో తమ అనుమతి తీసుకోకుండా తమ పిల్లల తల వెంట్రుకలను కట్ చేయడం ఏంటంటూ ఆ టీచర్ పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో తల వెంట్రుకలు పొడవుగా పెంచుకోవద్దన్న రూల్ ఉండడంతో ఈ టీచర్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సంబంధిత అధికారులు మీడియాతో మాట్లాడుతూ… సెయింట్ మీరా స్కూల్ కి చెందిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. దాదాపు 50-60 మంది విద్యార్థుల జుట్టును టీచర్ కట్ చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారని అన్నారు.
అందుకోసం తమ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నామని అన్నారు. తమ కుమారుడికి జ్వరం వచ్చిందని, అయినప్పటికీ స్కూల్లో అతడిని రోజంతా నిలబెట్టి జుట్టు కత్తిరించారని ఓ వ్యక్తి చెప్పాడు. తన జట్టు కత్తిరించవద్దని తాను కన్నీరు పెట్టుకున్నప్పటికీ తమ టీచర్ అందుకు ఒప్పుకోకుండా జుట్టును కట్ చేశాడని ఓ విద్యార్థి తెలిపాడు.
తన జుట్టు అప్పటికే చిన్నగా ఉందని, అయినప్పటికీ మరింత కట్ చేశాడని చెప్పాడు. ఈ ఘటనపై స్కూల్ డైరెక్టర్ అక్షి ప్రకాశ్ స్పందిస్తూ.. బడిలో నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు క్రమశిక్షణగా ఉండేలా చూసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతి ఏడాది ముందుగానే సంతకాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు తమ స్కూల్ పరువు తీయడానికి కావాలనే తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.