Assams Lady Singham
Assams Lady Singham : ఆమె ఓ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ మైండెండ్. నిజాయితీకి నిలువెత్తు రూపం. తమ, పర అనే భేదం లేదు. అయిన వాళ్లైనా, కాని వాళ్లైనా అందరూ సమానమే. వ్యక్తిగత అనుబంధాల కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తుంది. ఆ పోలీసు అధికారిణి ఇప్పుడు అందరితో శభాష్ అనిపించుకుంది. సూపర్ కాప్ అని పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందో తెలుసా?
ఏకంగా తనకు కాబోయే భర్తనే అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఏంటి? కంగుతిన్నారా? కాబోయే భర్తను అరెస్ట్ చేయడం ఏంటనే డౌట్ వచ్చిందా? ఎందుకంటే, అతడు మోసగాడని తెలియడంతో ఏమాత్రం ఆలోచన చేయకుండా అతడిని అరెస్ట్ చేసింది.(Assams Lady Singham)
Assam’s Lady Singham Woman Police Officer Arrests Her Fiance
నవంబర్ లో పెళ్లి.. ఇంతలోనే బయటపడ్డ నిజం..
ఆ మహిళా పోలీస్ పేరు జున్మోని రభా. అసోంలోని నాగావ్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తోంది. గత అక్టోబర్ లో రాణా పొగాగ్ తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉంది. రాణా పొగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐకి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది.
Assam’s Lady Singham Woman Police Officer Arrests Her Fiance
వాడో పెద్ద ఫ్రాడ్..
తాను ఓఎన్జీసీలో పని చేస్తున్నానని, తనకు డబ్బులు ఇస్తే ఓఎన్జీసీలో ఉద్యోగాలు కల్పిస్తానని పలువురి నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశాడు రాణా పొగాగ్. ఈ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం వెల్లడైంది. చివరికి అతడి పాపం పండింది.
Assam’s Lady Singham Woman Police Officer Arrests Her Fiance
Girl Gang Rape: అత్యాచారం కేసు నమోదు చేసేందుకు వెళితే.. దారుణానికి ఒడిగట్టిన పోలీసు
బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జున్మోని రభా… కాబోయే భర్త రాణా పొగాగ్ ను అరెస్ట్ చేసింది. కాబోయే భర్తను అరెస్ట్ చేసిన ఎస్ఐ.. హ్యాపీగా ఫీల్ అయ్యింది. పెద్ద మోసగాడి బారినుంచి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు.
అతడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వేనోళ్ల కృతజ్ఞతలు తెలిపారు. వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు. రాణా పోగాగ్ ఎంత మోసగాడో అర్థమైందని వెల్లడించారు.
కాగా, కాబోయే భర్త అని కూడా చూడకుండా మోసగాడని తెలిసిన వెంటనే అరెస్ట్ చేసిన లేడీ పోలీస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమెను లేడీ సింగంగా, లేడీ దబాంగ్ గా అభివర్ణిస్తున్నారు.
Assam’s Lady Singham Woman Police Officer Arrests Her Fiance