సామాజిక సామరస్యం కోసం : అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్‌లో దళితుడికి స్థానం

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 07:57 AM IST
సామాజిక సామరస్యం కోసం : అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్‌లో దళితుడికి స్థానం

Updated On : February 5, 2020 / 7:57 AM IST

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. 

“శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీలు (ధర్మకర్తలు)ఉంటారని వారిలో ఒక దళితుడు కూడా ఉంటారని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించేందుకు ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా ఈ అంశంపై మాట్లతాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  
 
‘‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో 15 మంది ట్రస్టీలో దళిత వర్గానికి చెందిన ఒకరికి ఎల్లప్పుడూ ప్రాతినిధ్యం ఉంటుందనీ..సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనికి ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ఆలయ ట్రస్టుకు ఇస్తామనీ.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు సభ్యులే తీసుకునేలా స్వేచ్ఛ ఉంటుందని షా స్పష్టంచేశారు.  

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూసే ప్రజల ఆకాంక్షలు త్వరలోనే నెరవేరుతాయని..శ్రీ రాముడికి తన జన్మస్థలం అయిన అయోధ్యలో గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు.