BHFL Good News : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్..గృహ రుణాల వడ్డీ రేటు తగ్గింపు

కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1న గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

BHFL Good News : బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్..గృహ రుణాల వడ్డీ రేటు తగ్గింపు

Bajaj

Updated On : October 1, 2021 / 6:40 PM IST

Bajaj Housing Finance Limited : కొత్త ఇల్లు కొనాలనుకుంటున్న వారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిహెచ్ఎఫ్ఎల్) గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1న గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఉపాధి కలిగిన ఉన్న దరఖాస్తుదారులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఈమేరకు కంపెనీ తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహీతలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో పేర్కొంది.

ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని కంపెంనీ వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

సెప్టెంబర్ 21న హెచ్‌డీఎఫ్‌సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రుణ మొత్తం ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుందని చెప్పింది.