Punjab AAP : కొడుకు ఎమ్మెల్యే.. తల్లి స్వీపర్, చీపురును వదలనంటోంది

తన కొడుకు ఎమ్మెల్యే కావడం తనకు సంతోషమేనని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని తన కొడుకు ఓడించడం జరిగిందన్నారు. ఏది ఏమైనా తమకు ఇంత తిండి పెట్టిన ఊడ్చే పనిని అస్సలు..

Aap Punjab (1)

Baldev Mother Continues To Work As A Sweeper : కొడుకు ఎమ్మెల్యే అయితే.. తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ? హంగు ఆర్బాటం.. అన్నీ వచ్చేస్తాయి. ఇంకేముంది ఇప్పటి దాక పడిన కష్టానికి ఫలితం దక్కింది. హాయిగా ఇంట్లో ఉండవచ్చు అని అనుకుంటారు. కదా.. కానీ ఓ తల్లి మాత్రం అలా అనుకోవడం లేదు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా.. తన వృత్తి ధర్మం మాత్రం వదలనంటోంది. నా డ్యూటీని కొనసాగిస్తానని స్పష్టం చేస్తోందా ఆ తల్లి. ఆమె పని చేసేది స్వీపర్. ఆమె ఎవరో కాదు పంజాబ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఏకంగా సీఎంను ఓడగొట్టాడు. ఆమె కొడుకే అతను. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి.

Read More : AAP Punjab : అమృత్‌‌సర్‌‌లో ఆప్ విజయోత్సవ ర్యాలీ

పంజాబ్ మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీపై భదౌర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ గెలుపొంది సంచలనం సృష్టించారు. ఇతని గురించి ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొబైల్ షాప్ లో పని చేసే వ్యక్తే సీఎంను ఓడించాడని, ఆమె తల్లి ఒక స్వీపర్ గా పని చేస్తే తండ్రి వ్యవసాయం చేస్తున్నాడని చెప్పడంతో అతను ఎవరో తెలుసుకొనేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. ఓ జాతీయ ఛానెల్ లాభ్ సింగ్ తల్లిని ఇంటర్వ్యూ చేసింది. ఈమె బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చే పనికి వెళుతున్నారు.

Read More : AAP : హేమాహేమీలను ఓడించిన లాభ్ సింగ్, జీవన్ జ్యోత్ కౌర్ ఎవరు ? నెటిజన్ల ఆసక్తి

తన కొడుకు ఎమ్మెల్యే కావడం తనకు సంతోషమేనని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని తన కొడుకు ఓడించడం జరిగిందన్నారు. ఏది ఏమైనా తమకు ఇంత తిండి పెట్టిన ఊడ్చే పనిని అస్సలు వదులుకోనని ఖరాఖండిగా చెప్పారు. ఏది ఏమైనా చీపురును వదలనని, తన డ్యూటీని కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. తనకు వచ్చే జీతంతోనే ఇంతకాలం ఇంటిని నెట్టుకొచ్చానని, ఇప్పుడు కూడా అలాగే చేస్తానని సమాధానం చెప్పారామె. ఆప్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు లాభ్ సింగ్. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో నిలబడి.. ఏకంగా సీఎంను ఓడించి అందరి మనస్సులను గెలుచుకున్నారు.