AAP Punjab : అమృత్‌‌సర్‌‌లో ఆప్ విజయోత్సవ ర్యాలీ

పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత...

AAP Punjab : అమృత్‌‌సర్‌‌లో ఆప్ విజయోత్సవ ర్యాలీ

Punjab Aap

Arvind Kejriwal And Bhagwant Mann : పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రోడ్డు షో నిర్వహించారు. రోడ్డును షోలో భాగంగా వేలాది మంది ఆప్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 16న ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిశారు భగవంత్‌ మాన్‌. మొన్న మొహాలీలో జరిగిన ఆప్‌ ఎమ్మెల్యేల సమావేశంలో తనను ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు గవర్నర్‌కు వివరించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను బన్వరీలాల్‌ పురోహిత్‌కు అందించామన్నారు. ఈనెల 16న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read More : AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే భగవంత్‌మాన్‌ సింగ్‌ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రతను తొలగించారు. అంతేకాదు.. తాను రాజ్ భవన్ లో కాకుండా…భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు.
పంజాబ్‌లో కొత్త శకానికి ఆప్‌ నాంది పలుకుతుందన్నారు భగవంత్‌ సింగ్ మాన్. పాలనలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు.

Read More : Punjab : పంజాబ్‌కా షాన్‌.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా… పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల్లో ఆప్ పార్టీ పటిష్టమైన వ్యూహాలు రచించింది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ప్రకటించింది. ఈయన ధురీ నుంచి పోటీ చేసి 58 వేల 206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.