Girl attacked with ‘acid’: యాసిడ్ రిటైల్ అమ్మకాలపై నిషేధం ఉన్నా యువకులకు అది దొరకడంపై మహిళా కమిషన్ సీరియస్
నిన్న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపైనే హోం శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 14న ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపుతున్నామని ఆమె పేర్కొన్నారు.

Girl attacked with 'acid'
Girl attacked with ‘acid’: మార్కెట్లో యాసిడ్ రిటైల్ అమ్మకాలపై నిషేధం ఉన్నా ఇద్దరు యువకులు దాన్ని కొని తీసుకొచ్చి దాంతో బాలికపై దాడి చేయడం పట్ల ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. యాసిడ్ రిటైల్ అమ్మకాల నిషేధంపై తీసుకున్న చర్యలపై తమకు నివేదిక అందించాలని ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
నిన్న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపైనే హోం శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 14న ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపుతున్నామని ఆమె పేర్కొన్నారు.
దేశంలో, ముఖ్యంగా దేశ రాజధానిలో యాసిడ్ అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని అన్నారు. యాసిడ్ రిటైల్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం ఉండాలని కమిషన్ పలుసార్లు ప్రతిపాదనలు చేసినప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఢిల్లీలో యాసిడ్ అమ్మకాల నిషేధ అమలు జరగడం లేదని, ఇటీవలే కమిషన్ ఓ నివేదిక విడుదల చేసిందని తెలిపారు.
అధికారులు తనిఖీలు చేయడం లేదని అన్నారు. యాసిడ్ దాడుల వల్ల బాధితుల జీవితం నాశనం అవుతుందని, దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, నిన్న ఢిల్లీ పోలీసులకు కూడా మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది.
Raghuram Rajan: అందుకే దేశంలో నిరుద్యోగం: రాహుల్‌తో రఘురామ్ రాజన్