Bengaluru : పనివారి పట్ల వివక్ష చూపుతున్న బెంగళూరు హౌసింగ్ సొసైటీ.. వైరల్ అవుతున్న సొసైటీ మెసేజ్

పని వారి పట్ల ఇంకా చాలా చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గా బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ రాసిన టెక్ట్స్ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Bengaluru

Bengaluru : బెంగళూరులో ఓ హౌసింగ్ సొసైటీ పనివారి పట్ల తీవ్ర వివక్షత చూపిస్తోంది. వారు తిరిగే ప్రాంతాల్లో మెయిడ్స్ కూర్చోవడం, నడవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం అంటూ ఆ సొసైటీ రాసిన టెక్ట్స్ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్.. స్మార్ట్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయ్..

ఇండియాలో కొన్ని గేటెడ్ సోసైటీల్లో సర్వీస్ వర్కర్లు, ఇంట్లో పనివారిపట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గా వైరల్ అవుతున్న ఓ ట్వీట్ అందుకు అద్దం పడుతోంది. తాము నడిచే, కూర్చునే ప్రాంతాలను పనిమనుషులు ఉపయోగించవద్దని కోరుతూ బెంగళూరు రెసిడెన్షియల్ సొసైటీ రాసిన టెక్ట్స్ వైరల్ అవుతోంది. @vibinbaburajan అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన నోట్ చదివి నెటిజన్లు మండిపడుతున్నారు. తాము నడిచే ప్రతిచోట మెయిడ్స్ తిరగడం వల్ల వారు అసౌకర్యంగా భావిస్తున్నారట. సెక్యూరిటీ కూడా సరిగా పర్యవేక్షించలేకపోతున్నారట. వంట పనివారు, ప్లంబర్లు, వడ్రంగులు రిసెప్షన్‌లో ఉండే సోఫాలు వాడటం వల్ల హౌసింగ్ సొసైటీ వారు ఆ సోఫాల్లో కూర్చవడం కూడా మానేశారట. ఇది ఆ టెక్ట్స్‌లోని సారాంశం. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు.

Hi-tech Auto : బెంగళూరులో హైటెక్ ఆటో.. అద్భుతం అంటున్న ప్రయాణికులు

‘వారు చేసే ఆహారం తింటారు. వారు శుభ్రం చేసే ఇంట్లో ఉంటారు. వారి సంరక్షణలో పిల్లల్ని వదిలిపెడతారు. కానీ వారు మన మధ్యలో తిరగడానికి పనికిరారా? అని ఒకరు.. దయ చేసి ఇలాంటి సొసైటీకి ఒక పేరు పెట్టండి. దాని వల్ల అయినా వివక్షను నివారించవచ్చునేమో? అంటూ వరుసగా కోపంగా స్పందించారు.