కొవ్వు కరిగించుకోవటానికి పోలీసుల జుంబా డ్యాన్స్: వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 05:01 AM IST
కొవ్వు కరిగించుకోవటానికి పోలీసుల జుంబా డ్యాన్స్: వైరల్ వీడియో

Updated On : February 22, 2020 / 5:01 AM IST

బెంగళూరు పోలీసులు జుంబా డాన్స్ ను ఇరగదీశారు. ఆటల్లో తేలిపోయారు.  పోలీసులు డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా అన్నట్లుగా ఉత్సాహంగా..ఆనందంగా ఆడిపాడారు. బెంగళూరు ‘నార్త్-ఈస్ట్ డివిజన్ పోలీసు సిబ్బంది ‘రిథమిక్ స్ట్రెస్ బస్టర్ – జుంబా ప్రోగ్రాం’ అనే క్యాప్షన్‌తో బెంగళూరు సిటీ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ కేసులు, దర్యాప్తుల్లో తలమునకలయ్యే పోలీసులు… జుంబా డాన్స్ ప్రాక్టీస్ చేశారు. కొవ్వు కరిగేలా స్టెప్పులేశారు. ఈ ప్రోగ్రాంలో 750మంది పోలీసులు డ్యాన్స్ లు వేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.  

బెంగళూరు పోలీసులు విజిల్స్ వేస్తూ..కేకలతో డ్యాన్స్ లను హోరెత్తించారు. తమ డ్యూటీలు, తమ పొజిషన్లూ అన్నీ మర్చిపోయారు. పాట విన్నామా డాన్స్ చేశామా అన్నట్లుగా స్టెప్పులేస్తూ చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేశారు. ఒంట్లో కొవ్వంతా కరిగించుకున్నారు. బెంళూరు నార్త్ ఈస్ట్ డివిజన్ పోలీసులకు ‘జుంబా క్లాస్’ నిర్వహించింది…ఇలా పిలుపునిచ్చిందో లేదో… అలా పోలీసులంతా వచ్చి జుంబా డ్యాన్స్ లో వాలిపోయారు. 

అందరిలా పోలీసులు కూడా సాధారమైన మనుషులే. అన్ని ఉద్యోగాలు వలెనే పోలీసులు కూడా ఫుల్ స్ట్రెస్‌లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పోలీసు ఉద్యోగాలకు కాస్తంత ఒత్తిడి ఎక్కువనే చెప్పాలి. ఆ ఒత్తిడితోనే కొంతమంది ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. సిబ్బంది కొరత..పెరుగుతున్న నేరాలు. ఇలా వారి ఒత్తిడికి ఎన్నో కారణాలు.   

ఎన్నో కేసులు, ఎన్నో వివాదాలు, నేరస్థుల కోసం తలలు పట్టుకుంటుంటారు. విపరీతమైన ఒత్తిళ్లలో పనిచేస్తుంటారు. అందువల్ల పోలీసులకు రిలీఫ్ కోసం ఇటువంటి క్లాసులు ఉంటే వారి ఒత్తిడి నుంచి కొంతైనా రిలీఫ్ పొందగలరు. వారి వారి డ్యూటీలను సక్రమంగా చేయగలరు. వీళ్లంతా ఎంత సంతోషంగా డాన్సులు వేస్తున్నారో. అంటే వీళ్లలో ఎంత స్ట్రెస్ ఉండి ఉండాలి. అది మర్చిపోయిన క్షణంలో వాళ్లు ఆకాశమే హద్దుగా ఆనందంగా డ్యాన్స్ లు వేస్తున్నారు. 

ఇలాంటి డాన్స్ క్లాసులు రెగ్యులర్‌గా నిర్వహిస్తే మంచిదే. ఎందుకంటే… పోలీసులు ట్రైనింగ్ పీరియడ్‌లో ఫిట్‌నెస్‌తో ఉంటారు. తరువాత వారు ఉద్యోగంలో చేరాక… టెన్షన్లు..ఓవర్ డ్యూటీలు..విశ్రాంతి లేక వల్ల బరువు పెరిగిపోతారు. ఒళ్లొచ్చేస్తుంది. దానికి బోనస్‌గా పొట్ట ఎగదన్నుకుని వచ్చేస్తుంది. చక్కటి ఫిట్ నెస్ తో తెలివి తేటలతో దొంగలు స్మార్ట్ గా మారిపోయిన దొంగలకు పట్టుకునే పరిస్ధితి ఉండదు. 

ఇలాంటి డాన్స్ క్లాసుల్లో చేరితే… పోలీసులకు పొట్ట పోతుంది. కొవ్వు కరిగిపోయి చక్కటి ఫిట్ నెస్ కూడా వస్తుంది.  అప్పుడు దొంగల పని పట్టొచ్చు. నేరస్థుల్ని పట్టుకోవటానికి బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది పోలీసులకు ఇదే తొలిసారి ఇలాంటి వాటిలో పాల్గొనడం. దాంతో 30 టీములు ఈ జుంబా డ్యాన్స్‌లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు.