Banks Strike : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్? ఏయే తేదీలు, కారణాలు ఏంటి..

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

Banks Strike : ఈ నెలలో రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటన చేసింది. ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు విఫలం అయ్యాయని, దీంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది.

”ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన సమావేశంలో UFBU సభ్యులు పాల్గొన్నారు. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పని వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ, కీలకమైన సమస్యలు పరిష్కారం కాలేదు” అని నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు.

Also Read : భారీగా లాభాలు.. బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలి? పూర్తి వివరాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్ల సాధన కోసం సమ్మెను ప్రకటించినట్లు తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య UFBU తెలిపింది. పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం (DFS) ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కూడా యూనియన్లు కోరుతున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల మైక్రో మేనేజ్ మెంట్ ను UFBU తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి జోక్యాలు బ్యాంకు బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని వాదించింది. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా గరిష్ట పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం, ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కోరడం వంటి డిమాండ్లు ఉన్నాయి.

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు UFBUలో ఉన్నాయి.