BATTLEGROUNDS MOBILE INDIA: జియో గేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0, విన్నింగ్ ప్రైజ్ రూ12.50లక్షలు

జియో, మీడియాటెక్ సంయుక్తంగా గేమింగ్ మాస్టర్స్ 2.0ను లాంచ్ చేయనున్నారు. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట రానున్న ఈ కాంటెస్ట్..

BATTLEGROUNDS MOBILE INDIA: జియో గేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0, విన్నింగ్ ప్రైజ్ రూ12.50లక్షలు

Battle Grounds

Updated On : November 12, 2021 / 3:51 PM IST

BATTLEGROUNDS MOBILE INDIA: జియో, మీడియాటెక్ సంయుక్తంగా గేమింగ్ మాస్టర్స్ 2.0ను లాంచ్ చేయనున్నారు. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట రానున్న ఈ కాంటెస్ట్.. ఆన్ లైన్ గేమ్ ఔత్సాహికులను, ప్రొఫెషనల్ గేమర్స్ ను మరింత ఆకట్టుకోనుంది. ఫస్ట్ సీజన్ ఫ్రీ ఫైర్ విజయవంతంగా 14వేల టీమ్స్ రిజిష్ట్రేషన్ అయ్యాయి. ఇక 23 నవంబర్ 2021 నుంచి లాంచ్ అవనున్న సెకండ్ సీజన్ ఏమేర ఆకట్టుకోనుందో చూడాలి.

* జియో నుంచి వచ్చిందే గేమింగ్ మాస్టర్స్. ఇండియాలోనే అతిపెద్ద డిజిటల్ సర్వీసెస్ ప్లేయర్, మీడియా టెక్ సంయుక్త నిర్మాణంలో రాబోతుంది. జియో గేమ్స్ ప్లాట్ ఫాంపైన జియోతో పాటు నాన్ జియో యూజర్లకు సైతం అందుబాటులో ఉండనుంది.

* గేమర్స్ స్కిల్స్, టీం వర్క్, వర్చువల్ గేమింగ్ లో నైపుణ్యం ఆధారంగా ప్రైజ్ మనీ రూ.12లక్షల 50వేలు అందజేస్తారు.

* అంతేకాకుండా ప్లే అండ్ విన్ డైలీ సిరీస్ లో ప్రతిరోజూ పార్టిసిపేట్ చేసి రివార్డులు అందుకోవచ్చు. ఈ అద్భుతమైన ఛాంపిన్ షిప్ లో ఆడి గెలిచిన ప్రొఫెషనల్ టీమ్స్ కు చాంపియన్ షిప్ దక్కుతుంది.

గుర్తుంచుకోవాల్సినవి
రిజిస్ట్రేషన్ : 2021 నవంబర్ 12తో మొదలు
టోర్నమెంట్ డేట్స్: 23నవంబర్ 2021 నుంచి 10 జనవరి 2022
లైవ్ లోకి వచ్చేది: జియోగేమ్స్ వాచ్, జియో టీవీ హెచ్‌డీ ఎస్పోర్ట్స్ ఛానెల్, ఫేస్ బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛానెల్

……………………………………….: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!

పార్టిసిపేషన్ ఫీజు ఏం లేకుండానే రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చు. జియో యూజర్లు మాత్రమే కాకుండా ఇతర యూజర్లు కూడా ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిష్టర్ అవ్వొచ్చు. జియోగేమ్స్.కామ్

‘పబ్ జీ’ న్యూ స్టేట్ పేరిట అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్ 17 భాషల్లో డిజైన్ చేశారని సమాచారం. గూగుల్ ప్లే స్టోర్ లో దీని సైజ్ 1.4 GBఉండగా..ఆండ్రాయిడ్ 6 వర్షన్ లో మాత్రమే ఈ గేమ్ ఆడడానికి వీలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆధునాతన ఆయుధాలతో ఈ గేమ్ రూపొందించినట్లు అంతేగాకుండా..ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవడం జరిగిందని పబ్ జీ సృష్టికర్త క్రాఫ్టన్ సంస్థ వెల్లడిస్తోంది.