ఢిల్లీలో ఇటీవల కారు బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ద్వారా దీనికి పాల్పడ్డారు. ఢిల్లీ పేలుడుకు ముందే డ్రోన్‌లను ఆయుధాల్లా మార్చడం, రాకెట్లు తయారు చేయడం వంటివాటికి యత్నించినట్టు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. డ్రోన్‌లతో హమాస్ దాడి తరహా ప్లాన్లు వేసుకున్నట్లు చెప్పాయి. హమాస్ అంటే పాలస్తీనా సాయుధ సంస్థ. హమాస్ 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో ఇటువంటి దాడి చేసింది.
ఢిల్లీ పేలుడు తర్వాత భారత్‌లో ఎన్‌ఐఏ రెండో అనుమానితుని అరెస్ట్ చేశాక పలు విషయాలు తెలిశాయి. అతడు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడు.
మొదటి అనుమానితుడు ఆమిర్ రషీద్ అలీలా జమ్మూకశ్మీర్ నివాసి. రెండో అనుమానితుడు జాసిర్ బిలాల్ వాణి అలియాస్ దానిశ్ కూడా జమ్మూకశ్మీర్‌కు చెందినవాడే. అతడిని ఎన్‌ఐఏ బృందం శ్రీనగర్‌లో పట్టుకుంది.
Also Read: హస్త సాముద్రిక పరంగా రాహువు: ఇలాగైతే మీకు పతనం తప్పదు.. మరణమే..
దానిశ్ డ్రోన్‌ల రూపురేఖలను మార్చి దాడులు జరపడం, రాకెట్లు తయారు చేయడం వంటి ప్రయత్నాలు చేశాడని ఎన్‌ఐఏ వెల్లడించింది. అనంతనాగ్ జిల్లాకు చెందిన దానిశ్ ఈ వైట్ కాలర్ మాడ్యూల్, ఆత్మాహుతి బాంబర్ నబీకి సహచరుడిగా పనిచేశాడని ఎన్‌ఐఏ తెలిపింది.
దానిశ్ పెద్ద బ్యాటరీలతో బలమైన డ్రోన్‌లు తయారు చేసి, అది భారీ బాంబులు మోసేలా చేయడానికి యత్నించాడు. అతనికి చిన్న డ్రోన్‌లు తయారు చేసిన అనుభవం ఉంది.
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశానికి డ్రోన్‌ను పంపి భారీ స్థాయిలో ప్రాణనష్టం కలిగించాలన్నదే వారి ప్లాన్. హమాస్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. భారత్ భారీ స్థాయిలో డ్రోన్ స్ట్రైక్, యాంటీ డ్రోన్ యూనిట్లను బలపరుస్తోంది.