హస్త సాముద్రిక పరంగా రాహువు: ఇలాగైతే మీకు పతనం తప్పదు.. మరణమే..
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
Kaal Sarp Dosh: హస్త రేఖలలో రాహువు స్థితి స్పష్టంగా తెలుస్తుంది. రాహుక్షేత్రము సుస్పష్టంగా, సమతలంగా ఉంటే మంచి ఆలోచనపరుడు, బుద్ధిమంతుడు, పరోపకారి, దయామయుడు, దేశభక్తుడు, ఉదారుడు అవుతాడు.
ఈ క్షేత్రంలో సంక్రమణ చేసే భాగ్యరేఖ భాగ్యవృద్ధి చేస్తుంది. కార్యక్రమమములు విజయవంతము అవటానికి, సమాజంలో కీర్తిపొందాలంటే ఈ రేఖవల్ల కలుగుతుంది.
అసలు మన హస్తములో రాహువు ఎక్కడ ఉంటాడు? అరచేతి మధ్యలో, మస్తకరేఖ క్రింద నెప్ట్యూన్, చంద్ర, శుక్ర, కుజ మొదలైన క్షేత్రాలలో ఆవరించిన దానిని రాహువు క్షేత్రంగా, చూసేందుకు వికారంగా, విస్తారంగా, భంగంగా ఉంటే ఆ వ్యక్తికి బాధలు కలుగుతాయి.
భాగ్యరేఖ ముక్కలు అయితే శక్తిహీనంగా ఉంటే, బాగాలేకపోతే ఈ క్షేత్రంలో ద్వీపం లేక అసుందర చిహ్నాలతో ఉంటే ఆపదలు వస్తాయి. రాహు క్షేత్రము వికారంగా ఉండి లోతుగా, అరచేతిలో నొక్కినట్లుగా ఉంటే పనులు నెరవేరవు. ఇలాంటి పరిస్థితిలో భాగ్యరేఖ శక్తిహీనము కూడా అయితే ఎలాంటి శుభములు ఇవ్వడు.
ఈ స్థానము ద్వీపాలతో కప్పి భాగ్యరేఖ ముక్కలైతే యవ్వన దశలో స్త్రీలతో కలహములు, అధిక ఖర్చులు, బాధలు వ్యంగ్య మాటలు, సంతానము తక్కువ, స్త్రీలు ఆచారహీనత, అసంస్కారులుగా మిగలటం వంటివి జరుగుతాయి. భాగ్యరేఖ మస్తక రేఖపై ఉంటే యవ్వనదశలో బాధలు కలుగుతాయి. కలలు విఫలం అవుతాయి.
అవమానములు, కుటుంబంలో కలహాలు మంచివాళ్లు చెడ్డవాళ్లుగా మారటము జరుగుతాయి. రాహుక్షేత్రంపై మంగళగ్రహరేఖలు ఉబ్బెత్తుగా, సరిగ్గా లేకపోతే ధననష్టము, అప్పులు, పతనమువైపు వెళ్లటము జరుగుతుంది. రాహు క్షేత్రము నుంచి స్వాస్థ్యరేఖ వెళ్లితే ఆ జాతకుడికి దీర్ఘకాలిక రోగములు, మానసిక వేదనలు, రోగము వల్ల మరణం కలుగుతుంది.
కొన్ని సందర్భాలలో ఉన్మాదిగా మారుతారు. పాశ్చాత్య సాముద్రికములు దీనిని కుజ మండలము అంటారు (ప్లేస్ ఆఫ్ మార్స్).. కానీ మనవారు రాహుక్షేత్రముగా వర్ణించారు. ఈ రాహుక్షేత్రమును బట్టి ఆ జాతకుని స్థితిగతులను నిర్ణయించవచ్చు. రాహుక్షేత్రము లోతుగా గుంతగా ఉంటే వ్యక్తికి ఎన్ని తెలివితేటలున్నా పైకి రాలేడు. అదృష్టము వరించదు.
రాహువు ఉండే స్థానము స్పష్టంగా బాగా కనిపిస్తే ఆ వ్యక్తికి మంచి హృదయము, ఇతరులకు సహాయము చేయడం, దేశం మీద గౌరవము, ఈ స్థానము లోతుగా అస్పష్టంగా కనపడితే అన్ని విషయాలలో వైఫల్యాలు అభివృద్ధి చెందక పోవటము, చాలా ఇబ్బందులు కలగటం ధనము ఖర్చు అవటము వంటివి జరుగుతాయి.
ఈ రాహుస్థానములో ఎక్కువ లోపాలు లేక ద్వీపాలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు సంపాదన కంటే ఖర్చు అధికము. స్త్రీలతో కలహములు కలుగుతాయి. ఈ రాహు స్థానంలో కలిస భాగ్యరేఖ బాగా ఉంటే సకల ఐశ్వర్యము కలుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు, రాజకీయాల్లో విజయం సాధిస్తారు. ఈ రాహుస్థానము బాగోలేక దానితోపాటు భాగ్యరేఖ కూడా ముక్కలు ముక్కలుగా ఉంటే ధననష్టము ఆపదలు కలుగుతాయి.
రాహు స్థానమును ద్వీపములు రకరకాల చిహ్నాలు ఉంటే ఆపదలు కలుగుతాయి. భాగ్యరేఖ మస్తక రేఖపై ఆగిపోతే చిన్నవయసులో బాధలు కలుగుతాయి. శత్రువులు అధికముగా ఉంటారు. అవమానాలు కలుగుతాయి. కుటుంబములో అనాచారములు, అవమానములు జరుగుతాయి. రాహుస్థానము కుజునితో లోపలికి వస్తే దరిద్రము, బాధలు వస్తాయి. రాహువు పై నుంచి ఆరోగ్య రేఖపోతే దీర్ఘకాలిక రోగములు వస్తాయి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956
