Tihar murder: తీహార్ మర్డర్‌కు ముందు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ వెనుక సీక్రెట్!!

తీహార్ జైలులో జరిగిన మర్డర్ కేసులో కీలక అంశాలు బయటికొస్తున్నాయి. ఆగష్టు 3 ఉదయం 9గంటల 30నిమిషాల నుంచి ఆగష్టు 4 సాయంత్రం 4గంటల 50నిమిషాల వరకూ సీసీటీవీ..

Tihar murder: తీహార్ మర్డర్‌కు ముందు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ వెనుక సీక్రెట్!!

Tihar Murder

Updated On : September 4, 2021 / 12:24 PM IST

Tihar murder: తీహార్ జైలులో జరిగిన మర్డర్ కేసులో కీలక అంశాలు బయటికొస్తున్నాయి. ఆగష్టు 3 ఉదయం 9గంటల 30నిమిషాల నుంచి ఆగష్టు 4 సాయంత్రం 4గంటల 50నిమిషాల వరకూ సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయిపోయి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తుంది. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అంకిత్ గుజ్జార్ అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. వార్డ్ 1, వార్డ్ 5A లోపల
ఉన్న సీసీటీవీ కెమెరాలను మెయింటైనెన్స్ వర్క్ కోసం స్విచాఫ్ చేశామని అధికారులు చెబుతున్నారు.

దోపిడీ రాకెట్ లో కీలక నిందితుడు గుజ్జార్ (29) హత్యకు గురయ్యాడంటూ వార్తలు ప్రసారం అయ్యాయి. ఆ సమయంలో రెండు వార్డులు మాత్రం సాక్ష్యాలకు కీలకంగా మారాయి.

ఆ సమయంలో జైలు ఖైదీలుగా ఉన్న వ్యక్తి మాట్లాడుతూ..’జైలు అధికారులు కావాలనే ఆగష్టు 3 మధ్యాహ్నం నుంచి సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఆ సమయంలో 50మంది గార్డులు లాఠీలతో గుజ్జార్ మరో ఇద్దరు ఖైదీలపై దాడి చేశార’ని చెప్తున్నాడు.

ఢిల్లీ పోలీసులు కేస్ రిజిష్టర్ చేశారు కానీ, ప్రధాన నిందితుడైన డీఎస్పీ నరేంద్ర మీనాను ఇంకా అరెస్ట్ చేయలేదు. ఘటన జరిగిన కొన్నాళ్ల పాటు సస్పెండ్ చేసినా.. ప్రస్తుతం పోలీస్ ప్రొటెక్షన్ తోనే ఉన్నాడు. గత నెల గుజ్జార్ అనుచరులు అతణ్ని చంపేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు ఆరోపించారు.

నెల రోజులుగా.. అవినీతి, కస్టడీలో టార్చర్, ఖైదీలకు సాయం చేయడం వంటి నిషేదిత పనులు చేస్తున్న వారిని తీసుకురావడంలో జైలులో మూడో కేసు. ఢిల్లీ పోలీస్ కమిఫనర్ రాకేశ్ అస్తానా దీనిపై ఇప్పటికే ఎంక్వైరీ జరుపుతున్నట్లు చెప్పారు. జైలు కింది భాగంలో అండర్ గ్రౌండ్ ఆఫీస్ నిర్మించిన బిల్డర్లపై విచారణ జరుపుతున్నారు. దీనంతటికీ సహకరించిన జైల్ ఆఫీసర్లు ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

గురువారం కోర్టులో మర్డర్ కేసు అంశంలో స్టేటస్ రిపోర్ట్ ఫైల్ అయింది. హత్యారోపణ విచారణలో భాగంగా సీసీటీవీ కెమెరా రికార్డింగ్ అడిగామని ఢిల్లీ పోలీస్ చెప్పారు. ఆ సమయంలో కెమెరాలు స్విచాఫ్ చేసి ఉంచారని.. ఆగష్టు 3ఉదయం నుంచి ఆగష్టు 4మధ్యాహ్నం వరకూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటంతో క్లోజ్ చేశామని చెప్పారు.

వార్డ్ 1లో ఉంచిన గుజ్జార్ ఆగష్టు 4వ తేదీ ఉదయం 6గంటల సమయంలో చనిపోయి కనిపించాడు. దీనిపై జైలు అధికారులు మాట్లాడుతూ.. గుజ్జార్ తో పాటుగా ఉన్న మరో ఇద్దరు ఖైదీల నుంచి సెల్ ఫోన్, డేటా కేబుల్, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మెడికల్ బోర్డు జరిపిన గుజ్జార్ పోస్ట్ మార్టం రిపోర్టులో.. తలకు, మెడకు, శరీరంలోని ఇతర భాగాలకు కనీసం 12గాయాలయ్యాయని రాసి ఉంది. సీసీటీవీ కెమెరాలు దొరక్కపోవడం, మృతదేహంపై గాయాలు ఉండటం బట్టి చూస్తుంటే కస్టొడియల్ వయోలెన్స్, టార్చర్ కింద పరిగణించాల్సి వస్తుందని చెప్తుంది.