Beggar
Beggar Donates 55Lakhs : ఈ రోజుల్లో డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. డబ్బు కోసం కొందరు ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారు. నేరాలు, ఘోరాలు కూడా చేస్తున్నారు. అన్యాయం, అక్రమాలు చేసైనా సరే.. డబ్బు సంపాదించడమే కొందరు ధ్యేయంగా పెట్టుకున్నారు. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే సమాజంలో మనకు అంత గౌరవం, హోదా అని భావించే వాళ్లు మన మధ్యలో చాలామందే ఉన్నారు. దాదాపుగా అందరికీ డబ్బు మీద ఆశ ఉంటుంది. ఇక కొంతమంది సంపాదించింది అస్సలు ఖర్చు పెట్టరు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పరమ పిసినారిగా వ్యవహరిస్తుంటారు.
కానీ, నాణెనికి రెండో వైపు ఉన్నట్లుగానే.. మనుషుల్లోనూ కొందరు మంచోళ్లు కూడా ఉంటారు. వారికి సంపాదన కన్నా నలుగురికి సాయం చేయడంలో, ఆకలితో ఉన్న వారి కడుపు నింపడంలోనే ఎక్కువ తృప్తిని పొందుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ వ్యక్తి కూడా ఈ కోవలోకే వస్తాడు. అతడు ఓ బిచ్చగాడు. అయితేనేమీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పదిమందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు.(Beggar Donates 55Lakhs)
Arvind Kumar Goyal : కలియుగ దానకర్ణుడు.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తిని దానం చేసిన డాక్టర్
తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్‌పాండియన్ (72) బిచ్చగాడు. 12ఏళ్లుగా భిక్షమెత్తుకుని జీవిస్తున్నాడు. బిచ్చగాడు అయినా మంచి మనసున్న వ్యక్తి. తాను భిక్షాటన చేయగా వచ్చిన సొమ్ము పదిమందికి ఉపయోగపడాలనే మంచి మనసుతో.. ఆ డబ్బును సీఎం సహాయనిధికి అందిస్తున్నాడు. అలా ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు.
Bill Gates: బిల్గేట్స్ సంచలన నిర్ణయం.. లక్షన్నర కోట్లు దానం!
ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.55.60 లక్షలను పలు జిల్లాల కలెక్టర్లకు అందించాడు. తాజాగా సోమవారం నాడు వేలూరు కలెక్టరేట్‌లో గ్రీవెన్‌సెల్‌కు వెళ్లి తన దగ్గరున్న రూ.10వేలను కలెక్టర్‌కు అందించాడు. ఈ మొత్తాన్ని శ్రీలంక తమిళులకు ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశాడు.
ప్రస్తుతం శ్రీలంకలో సంక్షోభం కారణంగా అక్కడి తమిళులు అష్టకష్టాలు పడుతున్నారని.. వాళ్లకు సహాయ సహకారం అందించాలని కోరాడు. భిక్షాటన ద్వారా తనకు వచ్చే డబ్బును ప్రజల కోసమే ఉపయోగిస్తున్నానని పూల్ పాండియన్ తెలిపాడు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు వివరించాడు. అలా, ఇప్పటివరకు రూ.55.60 లక్షలు విరాళంగా అందజేసినట్లు చెప్పాడు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
డబ్బు కోసం దిగజారిపోయే మనుషులున్న ఈరోజుల్లో భిక్షాటన చేసి మరీ నలుగురికి సాయం చేస్తున్న పూల్ పాండియన్ నిజంగా గ్రేట్ కదూ. బిచ్చగాడైనా పెద్ద మనసుతో నలుగురికి సాయంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూల్ పాండియన్ గొప్ప మనసుని అంతా ప్రశంసిస్తున్నారు. నువ్వు దేవుడు సామీ అని కితాబిస్తున్నారు.