Arvind Kumar Goyal : నువ్వు దేవుడు సామీ.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తిని దానం చేసిన డాక్టర్

డబ్బు ఓ జబ్బుగా మారిన ఈ రోజుల్లో.. ఓ మహానుభావుడు పేదల కోసం తన యావదాస్తిని దానం చేసేశాడు. వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. నువ్వు దేవుడు సామీ.. అని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.

Arvind Kumar Goyal : నువ్వు దేవుడు సామీ.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తిని దానం చేసిన డాక్టర్

Arvind Kumar Goyal (3)

Arvind Kumar Goyal : పైసామే పరమాత్మ అన్నారు. డబ్బే సర్వస్వం అనే రోజులు ఇవి. మనిషిని నడిపించే ఇంధనం కరెన్సీ అని నమ్మే కాలం ఇది. మనిషి తన ఆర్థిక అవసరాల కోసం సృష్టించుకున్న కాగితపు ముక్క.. ఇప్పుడు మనిషినే శాసించే స్తాయికి చేరింది. డబ్బు కోసం ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టేందుకు కూడా వెనుకాడని మనుషులున్న రోజులివి. కొందరు డబ్బే శ్వాసగా బతుకుతున్నారు. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలని ఆరాటపడుతున్నారు. మనీ కోసం మనిషి ఎలాంటి నేరాలకైనా, ఘోరాలకైనా పాల్పడేందుకు వెనుకాడటం లేదు.

అయితే.. నాణెనికి రెండు వైపులు ఉన్నట్లు.. ఇక్కడ మరో కోణమూ ఉంది. ఈ సమాజంలో డబ్బు కోసం దిగజారిపోయే వాళ్లే కాదు.. మంచి వాళ్లూ ఉన్నారు. వాళ్లు ఎంత మంచి వాళ్లు అంటే.. తమ యావదాస్తిని సేవా కార్యక్రమాల కోసం దానం చేసే అంత మంచి వాళ్లు. డబ్బు ఓ జబ్బుగా మారిన ఈ రోజుల్లో.. ఓ మహానుభావుడు తన యావదాస్తిని దానం చేసేశాడు. వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. నువ్వు దేవుడు సామీ.. అని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.

Arvind Kumar Goyal (4)

Arvind Kumar Goyal (4)

ఆయన పేరు అరవింద్‌ కుమార్ గోయల్‌. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ కు చెందిన డాక్టర్. విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త కూడా. కోట్లాది రూపాయలు గడించిన గోయల్.. పేదలకు సాయం చేస్తూ సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు పొందారు. పేదలకు సాయం చేస్తున్నా ఏదో వెలితి ఆయనను వేధించేది. సమాజం కోసం ఇంకా ఏదో చేయాలన్న తపనతో మదనపడేవారు. అంతే, క్షణం ఆలోచించకుండా 50ఏళ్లుగా తాను కష్టపడి కూడబెట్టిన రూ.600కోట్ల ఆస్తులను పేదల కోసం ప్రభుత్వానికి విరాళమిచ్చారు.

Cleaning Workers : డబ్బే డబ్బు.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. కోటి రూపాయలకు పైగా జీతం

పేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం తన యావదాస్తిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు గోయల్‌ ప్రకటించారు. తమ కోసం కేవలం ఒకే ఒక్క ఇంటిని ఉంచేసుకొని మిగతా ఆస్తులన్నింటినీ దానం చేశారు. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.600కోట్ల వరకు ఉంటుందట. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని గోయల్‌ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ గోయల్ ఆస్తులను లెక్కించనుంది.

Arvind Kumar Goyal (1)

Arvind Kumar Goyal (1)

అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న గోయల్.. 100కు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మొరాదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు. గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబసభ్యులు కూడా మద్దతిచ్చారట.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”నా సంపదనంతా పేదలకు విరాళంగా ఇవ్వాలని 25ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా. ఆ రోజు నాకు ఎదురైన ఓ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. పాతికేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పేద వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు చాలా చలిగా ఉంది. ఆ వ్యక్తి ఒంటిపైన కప్పుకోడానికి ఏమీ లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతడిని చూసి నా మనసు చలించిపోయింది. నాకు చేతనైన సాయం చేశా. కానీ, ఆ తర్వాత నాకు అన్పించింది. ఇలాంటి వాళ్లు దేశంలో ఎంతోమంది ఉంటారు కదా. వాళ్లకు కూడా నావంతు సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా’’ అని గోయల్ చెప్పుకొచ్చారు. నాటి నుంచి పేదల కోసం సాయం చేస్తూ వచ్చిన గోయల్‌.. ఇప్పుడు ఏకంగా ఆస్తినంతా దానం చేయడం విశేషం.

Goyal

Goyal

సమాజం కోసం గోయల్‌ చేస్తున్న సేవలకు మెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు నలుగురు రాష్ట్రపతుల నుంచి ఆయన పురస్కారాలు అందుకోవడం విశేషం.

డబ్బు కోసం దిగజారిపోయే మనుషులున్న ఈ రోజుల్లో పేదల కోసం తన యావదాస్తిని దానం చేసిన గోయల్ లాంటి వ్యక్తులు అందరికీ ఆదర్శప్రాయులు. ఆయన నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నువ్వు దేవుడు సామీ..అంటూ.. గోయల్ ను భగవంతుడితో పోలుస్తున్నారు.