Cleaning Workers : డబ్బే డబ్బు.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. కోటి రూపాయలకు పైగా జీతం

ఎలాంటి టెన్షన్లు, టార్గెట్లు, ప్రెజర్లు ఇవేవీ లేకుండానే సింపుల్ పని చేస్తూనే ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? జస్ట్.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. నెలకు రూ.9 లక్షల జీతం ఇస్తారంటే బిలీవ్ చేస్తారా? ఆ విధంగా ఏడాదికి కోటి రూపాయలకు పైనే శాలరీ ఇస్తారు. ఏంటి.. షాక్ అయ్యారా? కానీ, ఇది నిజ్జం.(Cleaning Workers)

Cleaning Workers : డబ్బే డబ్బు.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. కోటి రూపాయలకు పైగా జీతం

Cleaning Workers

Cleaning Workers : ఈ రోజుల్లో బాగా జీతం వచ్చే ఉద్యోగం ఏదైనా ఉందంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సాఫ్ట్ వేర్ జాబ్. ఐటీ కంపెనీలు టెక్ ఉద్యోగులకు భారీగానే జీతాలు ఇస్తాయి. ఏడాదికి కోట్ల రూపాయల శాలరీ ఇస్తాయి. ఆ తర్వాత ఆ రేంజ్ లో సంపాదించే వారు ఎవరైనా ఉన్నారా అంటే.. డాక్టర్లు అని చెప్పుకోవచ్చు. వారి జీతాలు కూడా భారీగానే ఉంటాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో శాలరీలు ఊరికే ఇవ్వరు. బాగా కష్టపడి పని చేయాలి. మన టాలెంట్ తో కంపెనీని వృద్ధిలోకి తేవాలి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై చాలా బాధ్యతే ఉంటుంది. జీతానికి తగ్గట్టుగానే జాబ్ టెన్షన్లు కూడా ఉంటాయి.

World longest train : ప్రపంచంలోనే అతి పొడవైన రైలు..కూర్చోవడానికి సీటే ఉండదు..!!

అయితే, ఇలాంటి టెన్షన్లు, బాధ్యతలు, టార్గెట్లు ఏవీ లేకుండానే సింపుల్ పని చేస్తూనే ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? జస్ట్.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. నెలకు రూ.9 లక్షల జీతం ఇస్తారంటే బిలీవ్ చేస్తారా? ఆ విధంగా ఏడాదికి కోటి రూపాయలకు పైనే శాలరీ ఇస్తారు. ఏంటి.. షాక్ అయ్యారా? కానీ, ఇది నిజ్జం.

Cleaning Tables (1)

Cleaning Tables (1)

ఆస్ట్రేలియాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అక్కడ శానిటేషన్ ఉద్యోగుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఆఫీసుల్లో కిటికీలు, టేబుళ్లు క్లీన్ చేసే ఉద్యోగులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు శానిటేషన్ ఉద్యోగులకు కళ్లు చెదిరే రేంజ్ లో భారీ ప్యాకేజీలు ఇస్తున్నాయి. గతంలో గంటకు రూ.2వేల 700 ఇస్తే.. ఇప్పుడు రూ.3వేల 600 వరకు చెల్లిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో రూ.4వేల 700 వరకు ఇస్తున్నాయి. దీంతో వారు నెలకు సగటున రూ.8-9లక్షలు, ఏడాదికి రూ.98 లక్షల నుంచి రూ.కోటికి పైగా సంపాదిస్తున్నారు. ఇది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, డాక్టర్ల జీతాలా కంటే ఎక్కువ. ఈ లెక్కన టేబుళ్లు, కిటికీలు తుడుస్తూ వాళ్లు కూడా కోటీశ్వరులు అయిపోవచ్చన్నమాట.(Cleaning Workers)

Shark Fish : షికారుకు వెళ్లి..షార్క్‌తో పరాచికాలా? చుక్కలు చూపెట్టిందిగా..

జస్ట్ కిటికీలు, టేబుళ్లు తుడిస్తే కోటి రూపాయల జీతం అని తెలిసి అంతా విస్తుపోతున్నారు. క్లీనింగ్ ఉద్యోగులకు అంత డిమాండ్ ఉండటం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. మన దేశంలోనూ అలాంటి ఉద్యోగాలకు అంత పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఎంత బాగుండో అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఆస్ట్రేలియాలో క్లీనింగ్ కార్మికులకు డిమాండ్ దాదాపు ఆల్ టైమ్ హైలో ఉంది. అక్కడ భారతీయ డాక్టర్, ఇంజనీర్ కంటే క్లీనర్ జీతం చాలా ఎక్కువ అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి ప్రధాన కారణం, ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కొరతే. ఈ కారణంతోనే అనేక క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీలు తమ కార్మికుల జీతాన్ని భారీగా పెంచాయి. ఆశ్చర్యకరంగా వారి జీతం ప్యాకేజీ కోటి రూపాయలను తాకుతుంది.

Cleaning Windows

Cleaning Windows

ఆస్ట్రేలియాలో క్లీనర్లను కనుగొనడం అంత సులభం కాదంటున్నాయి క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు. ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి, చాలా కంపెనీలు క్లీనింగ్ కార్మికుల జీతాన్ని గంట ప్రాతిపదికన పెంచాయి. వారు ప్రతి నెలా సగటున 8 లక్షల రూపాయల జీతం పొందుతున్నారు. వారి సగటు జీతం ఏడాది ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ. 96 లక్షల వరకు ఉంటుంది. అయితే చాలా కంపెనీలు దానిని రూ. 98లక్షల నుంచి కోటి రూపాయలకుపైగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి.

సిడ్నీకి చెందిన క్లీనింగ్ కంపెనీ అబ్సొల్యూట్ డొమెస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జో వెస్ దీనిపై స్పందించారు. ” శుభ్రం చేయడానికి వ్యక్తులు లేనందున ఉద్యోగుల జీతం పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి జీతం గంటకు $45కి (గంటకు రూ.3600) పెంచబడింది. 2021 నుండి ఆస్ట్రేలియాలో పారిశుధ్య కార్మికుల కొరత ఉంది. దాదాపు ఒక సంవత్సరం క్రితం, ఒక క్లీనర్ గంటకు రూ. 2700 పొందే చోట, ఇప్పుడు అతనికి రూ. 3500-3600 అందిస్తున్నారు” అని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలోని ఇతర కంపెనీలదీ అదే పరిస్థితి. కొన్ని కంపెనీలు గంటకు రూ. 4700 లేదా అంతకంటే ఎక్కువ పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కిటికీలు మరియు గట్టర్‌లను శుభ్రం చేయడానికి సంవత్సరానికి రూ. 82 లక్షల వరకు జీతం ఇస్తున్నారు. ఆస్ట్రేలియాలోనే కాదు.. బ్రిటన్‌లోనూ అలాంటి పరిస్థితే ఉంది. క్లీనింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు భారీగా జీతాలు ఇస్తున్నారు. కేవలం పొలంలో క్యాబేజీ తీయడానికే సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారంటే.. క్లీనింగ్ ఉద్యోగులకు అక్కడ ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.