Bengaluru : ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా కట్టడంలో ఎవరికి మినహాయింపు ఉండదు.. ఇప్పుడు చెప్పబోయే ఘటన అందుకు ఉదాహరణ. బెంగళూరులో ఓ బస్సు డ్రైవర్ తప్పుగా యూ టర్న్ తీసుకుని చలాను కట్టాడు. అతను చలాను కట్టడానికి కారణం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బెంగళూరులో ఓ స్కూలు బస్సు డ్రైవర్ తప్పుగా టర్న్ తీసుకున్నందుకు చలాన్ జారీ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగళూరులోని గరుడాచారపాళ్య మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపై స్కూల్ బస్సు డ్రైవర్ తప్పుగా యూ టర్న్ తీసుకోవడంతో ఇదంతా మొదలైంది. FixBangalorePlz అనే ట్విట్టర్ యూజర్ ‘విద్యార్దులతో నిండిన పాఠశాల బస్సు బ్రిగ్రేడ్ మెట్రోపాలిస్ నుండి గరుడాచారపాళ్య మెట్రో స్టేషన్ లో తప్పుడు మార్గంలో నడుస్తోంది. బస్సు నంబర్ బస్సు నంబర్ KA53AA6189..దయచేసి తీవ్రమైన జరిమానా విధించండి. స్కూలు బస్సు.. పిల్లల ప్రాణాలకు హాని జరిగి ఉంటే’ అనే శీర్షికతో పోస్ట్ చేశాడు.
Brave Woman: డ్రైవింగ్ లో మూర్చపోయిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన మహిళ
ఇక అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఊహించని సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్ జరిమానా రశీదును పట్టుకుని ఉండగా అతని పక్కన పోలీసు అధికారి నిలబడి ఉన్న ఫోటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘బస్సు డ్రైవర్‌కు జరిమానా విధించబడింది’ అని మహదేవపుర ట్రాఫిక్ పోలీసు విభాగం ట్వీట్ చేసింది. ‘బస్సు డ్రైవర్ చేసిన పనికి అవార్డు ఇచ్చారా?’ అని ‘డ్రైవర్ రివార్డు అంగీకరించినట్లుగా ఉన్నాడు’ అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇదిగో ఇలా కూడా దొరికిపోవచ్చు.
@ChrysalisHigh Your school bus full of students is driving down wrong way under Garudacharpalya metro station from Brigade Metropolis. Bus number KA53AA6189 . @blrcitytraffic please impose severe fine, being school bus and endangering life of so many kids is not done
— FixBangalorePlz (@G1_G) July 18, 2023