Caught On Camera: ఏడో తరగతి విద్యార్థినిపై బస్సు డ్రైవర్ దాడి.. వీడియోలో రికార్డైన ఘటన.. డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం

స్కూల్‌కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Caught On Camera: ఏడో తరగతి విద్యార్థినిపై బస్సు డ్రైవర్ దాడి.. వీడియోలో రికార్డైన ఘటన.. డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం

Caught On Camera: స్కూల్ బస్సులో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు బస్సు డ్రైవర్. దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

PM Modi: రిషి సునాక్‌కు మోదీ ఫోన్.. కలిసి పనిచేద్దామని పిలుపు.. వాణిజ్య ఒప్పందంపై చర్చ

గత మంగళవారం, అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం, డెట్రాయిట్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న ఒక పన్నెండేళ్ల బాలికకు, ఆమె స్కూల్ బస్సు డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో డ్రైవర్ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఇద్దరూ బస్సులోని సీట్లపై పడి కొట్టుకున్నారు. ఈ ఘటనను అక్కడి విద్యార్థుల్లో ఒకరు వీడియో తీశారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీసులు, స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఘటనలో దాడికి పాల్పడ్డ బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేసింది. విచారణ అనంతరం డ్రైవర్‪ను పూర్తిగా విధుల్లోంచి తొలగించే అవకాశం ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కూడా స్పందించారు.

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

బస్సు డ్రైవరే అనవసరంగా దాడికి పాల్పడ్డాడని, అసభ్య పదజాలం వాడాడని చెప్పారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఆ బాలిక తను చెప్పినట్లు వినకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని డ్రైవర్ అన్నాడు. తాను బాలికను సీట్లో కూర్చొమ్మని చెప్పినప్పటికీ ఆమె వినలేదని, పైగా తనపైకి దూసుకొచ్చిందని, అందువల్లే తాను తిరిగి దాడి చేశానని డ్రైవర్ చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు.