హైదరాబాద్ బిర్యానీ ఫేమస్..నీతి ఆయోగ్‌ CEOకు KTR ట్వీట్

  • Publish Date - February 6, 2020 / 10:57 AM IST

హైదరాబాద్ బిర్యాని అంటే చాలు..లొట్టలేసుకుంటూ..తింటుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రేటీ, ప్రముఖుల వరకు ఈ బిర్యానీ అంటే ఫిదా అవుతుంటారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు..బిర్యానీ తినకుండా వెళ్లలేరు. సూపర్, ఫెంటాస్టిక్ అంటూ కితబిస్తూ..వెళుతుంటారు. అయితే…నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్‌కు మాత్రం హైదరాబాద్ బిర్యానీ నచ్చలేదంట..పారీస్‌కు చెందిన తలసేరి ఫిష్ బిర్యానీ సూపర్ అంటూ ఓటేశారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌ను చూశారు. వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీ హక్కులన్నీ హైదరాబాద్‌కు చెందినవేనంటూ అమితాబ్‌కు వెల్లడించారు. తాను ఖచ్చితంగా చెబుతున్నట్లు, హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే..మిగిలివన్నీ..అనుకరించినవేనని తెలిపారు. ఇటీవలే UNESCO కూడా తమ ఆహార సంస్కృతీని గుర్తించి ఓ బిరుదు కూడా ఇచ్చిందని నీతి ఆయోగ్ CEOకు తెలిపారు. 

ఇదిలా ఉంటే…ప్రపంచమంతా హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయిపోయిన విషయం ఇటీవలే బయటకొచ్చింది. 2019 సంవత్సరానికి గాను ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్‌లో టాప్ – 10 ఐటమ్స్‌లో బిర్యానీకి ఫస్ట్ ప్లేస్ దక్కింది. సగటున నెలకు 4.56 లక్షల మంది బిర్యానీ కోసం సెర్చ్ చేసినట్లు ఇండియన్ ఫుడ్స్‌పై అమెరికాకు చెందిన సెమ్ రష్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.

హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచస్తారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు, సినీ, రాజకీయ, క్రీడా, ఇలా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రెటీలు బిర్యానీ రుచి చూడందే వెళ్లరు.