Taj Mahal  : BF 7 Variant ఎఫెక్ట్ .. కోవిడ్ పరీక్షలు చేయించుకుంటేనే తాజ్ మహల్ సందర్శనకు అనుమతి

కోవిడ్ మహమ్మారి నుంచి విముక్తి పొంది హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నవేళ మరోసారి BF 7 Omicron Variant రూపంలోమరోసారి హడలెత్తిస్తోంది. ఈ ప్రభావం పర్యాటకరంగంపై కూడా పడనుంది గతంలో వలెనె. దీంట్లో భాగంగా తాజ్ మహల్ ను సందర్శించాలంటే కోవిడ్ పరీక్షలు తాజాగా చేసుకోవాలని స్పష్టంచేసారు ఆగ్రా అధికారులు.

BF 7 Omicron Variant..Taj Mahal : కోవిడ్ మహమ్మారి నుంచి విముక్తి పొంది హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నవేళ మరోసారి BF 7 Omicron Variant రూపంలోమరోసారి హడలెత్తిస్తోంది. ఈ ప్రభావం పర్యాటకరంగంపై కూడా పడనుంది గతంలో వలెనె. దీంట్లో భాగంగా తాజ్ మహల్ ను సందర్శించాలంటే కోవిడ్ పరీక్షలు తాజాగా చేసుకోవాలని స్పష్టంచేసారు ఆగ్రా అధికారులు.

ప్రపంచ వింతల్లో ఒకటైన చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ పై మారోసారి కోవిడ్ ప్రభావం పడనుంది.ఈ ప్రేమ మందిరాన్ని చూడటానికి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు తాజాగా చేయించుకుని ఉండాలని ఆగ్రా అధికారులు తెలిపారు. ప్రతీరోజు తాజ్ మహల్ ను సందర్శించటానికి పర్యాటకు వేలు..లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ BF 7 Omicron కేసులు భారత్ లో కూడా నమోదు కావటంతో ఈ నిబంధన తప్పనిసరి అయ్యింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు ఆగ్రా అధికారులు. పరీక్షలు చేయించుకున్నట్లుగా పత్రాలు చూపితేనే తాజ్ మహల్ సందర్శనకు అనుమతి ఇస్తామని స్పష్టంచేసింది.

BF 7 Omicron Sub Variant : BF7 కోవిడ్ వేరియంట్‌పై భారత్ అప్రమత్తం..ప్రధాని అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం

ఇప్పటి వరకు చైనాలో ఈ కొత్త వేరియంట్ కల్లోలం సృష్టించగా అదిప్పుడు భారత్ కూడా వ్యాపించింది. భారత్ లో ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 వేరియంట్‌ కరోనా కేసులు మూడు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర అప్రమత్తమవ్వటమే కాకు అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు