BF 7 Omicron Sub Variant : BF7 కోవిడ్ వేరియంట్‌పై భారత్ అప్రమత్తం..ప్రధాని అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం

BF7 కోవిడ్ వేరియంట్ పై భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిపుణుల సూచనలు మంత్రి ప్రధాని మోడీకి వివరించనున్నారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయటం వంటి పలు అంశాలను ఆరోగ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకురానున్నారు. దీని కోసం ప్రధాని అధ్యక్షతన అత్యున్నతస్థాయి గురువారం (డిసెంబర్ 22,2022) సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కొత్త వేరియంట్ పరిస్థితులను ప్రధాని సమీక్షించనున్నారు.

BF 7 Omicron Sub Variant : BF7 కోవిడ్ వేరియంట్‌పై భారత్ అప్రమత్తం..ప్రధాని అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం

BF 7 Omicron sub variant

BF 7 Omicron sub variant : BF7 కోవిడ్ వేరియంట్ పై భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిపుణుల సూచనలు మంత్రి ప్రధాని మోడీకి వివరించనున్నారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయటం వంటి పలు అంశాలను ఆరోగ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకురానున్నారు. దీని కోసం ప్రధాని అధ్యక్షతన అత్యున్నతస్థాయి గురువారం (డిసెంబర్ 22,2022) సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కొత్త వేరియంట్ పరిస్థితులను ప్రధాని సమీక్షించనున్నారు.

కరోనా మహమ్మారి పీడ వదిలిందని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి తన తడాఖా చూపిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లుగా మారి మరోసారి విరుచుకుపడుతోంది. ఈక్రమంలో
BF7 కోవిడ్ వేరియంట్ గా హడలెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వేరియంట్ విజంభించి దేశాన్ని కల్లోలం చేస్తోంది. ఈ ప్రభావం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు వ్యాపించింది. జపాన్, దక్షిణకొరియా, అమెరికా, బ్రెజిల్ తో పాటు భారత్ లో కూడా BF7 కోవిడ్ వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖా మంత్రి నిపుణులతో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.

Wear Masks In Crowded Places : కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించండీ : కేంద్ర మంత్రి సూచనలు

కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని బయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ వైరస్ మరోసారి యాక్టివ్‌గా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాతో పాటు ఇతర దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రపంచానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కరోనా వేగం చాలా నెమ్మదిగా ఉన్నా.. అజాగ్రత వద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రానున్న కాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించింది. చైనాను హడలెత్తించిన BF 7 వేరియంట్ కేసులు భారత్‌లోనూ నమోదవ్వడంతో మహమ్మారి ముప్పుపై ఆందోళన మొదలైంది.

BF 7 పాయింట్‌ సెవెన్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్‌కు సబ్‌ వేరియంట్‌ అయిన ఈ వైరస్‌.. చైనాను గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారిని మన దేశంలోనూ గుర్తించారు. జులై, అక్టోబర్‌ నెలల్లోనే గుజరాత్‌, ఒడిశాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో బాధితుల్ని ఐసోలేట్‌ చేసి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంతో.. వారు క్షేమంగా బయటపడ్డారు. ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీలో మరణ మృదంగం మోగిస్తోంది ఇదే వైరస్‌ కావడంతో.. భారత్‌తో పాటు వరల్డ్‌ వైడ్‌గా మళ్లీ టెన్షన్‌ తప్పట్లేదు. జనం ప్రాణాల మీదకు రాకముందే.. బీఎఫ్‌ పాయింట్‌ సెవెన్‌ను కంట్రోల్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు ఎలా జాగ్రత్త పడాలో గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రంగంలోకి దిగి ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు.