Wear Masks In Crowded Places : కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించండీ : కేంద్ర మంత్రి సూచనలు

Covid ఇంకా ముగియలేదని జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి అని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి సూచించారు. జపాన్‌, అమెరికా, ముఖ్యంగా చైనాలో కోవిడ్ కేసులు అత్యంత భారీగా పెరుతున్న క్రమంలో తాజా పరిస్థితులపై అంచనా వేయటానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని మంత్రి సూచించారు.

Wear Masks In Crowded Places : కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించండీ : కేంద్ర మంత్రి సూచనలు

Wear Masks In Crowded Places said center health ministe

Wear Masks In Crowded Places : కోవిడ్ చైనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే జపాన్‌, అమెరికా,కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి అని సూచించింది.జపాన్‌, అమెరికా, ముఖ్యంగా చైనాలో కోవిడ్ కేసులు అత్యంత భారీగా పెరుతున్న క్రమంలో తాజా పరిస్థితులపై అంచనా వేయటానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

చైనాలో జీరో కోవిడ్ విధానం బెడిసికొట్టింది. చైనీయులు తీవ్ర ఆగ్రహంలో నిరసనలు ప్రదర్శించారు. లాక్ డౌన్లు ఇక ఎట్టి పరిస్థితుల్లోనే భరించలేమని…ఆంక్షలను సహించేదిలేదని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తతటం చైనా ప్రభుత్వం దిగి వచ్చింది. ఆంక్షలను ఎత్తివేయటంతో ఆ ఫలితం చైనీయులను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. భారీగా కేసులు నమోదు కావటం ఆస్పత్రులు ఫుల్ అయిపోవటం మరణాలు కూడా పెరగటంతో అంత్యక్రియలు చేయటానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చైనాలో ఉన్న ఈ పరిస్థితి ప్రభావం అమెరికా, జపాన్,కొరియా వంటిదేశాల్లో కూడా కొత్త కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ప్రభావం భారత్ లో కూడా కనిపిస్తున్నట్లే ఉంది. ఎందుకంటే భారత్ లో కోవిడ్ కేసులు 1000కిపైగా నమోదయ్యాయి. దీంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది.

తాజా పరిస్థితులపై అంచనా వేయటానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై కరోనా పరిస్థితులను చర్చించి చర్యలు తీసుకోవటానికి ఇకపై ప్రతివారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు. పలు దేశాల్లో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని దీంతో భారత్ కూడా అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని కాబట్టి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఆదేశించారు. ‘‘కరోనా ఇంకా ముగిసిపోలేదు. అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.