Bharat Jodo Yatra 9th day: అందుకే భారత్ జోడో యాత్ర చేస్తున్నాం: కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ... టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 17 నెలలుగా రెండంకెల సంఖ్యలోనే కొనసాగుతోందని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వహిస్తున్న నిశ్శబ్దాన్ని బద్ధలు కొట్టేందుకే తాము భారత్ జోడో యాత్ర చేస్తున్నామని చెప్పారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణంపై ప్రధాని మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది?’’ అని ఆయన నిలదీశారు.

AICC President election

Bharat Jodo Yatra 9th day: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 9వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ… టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 17 నెలలుగా రెండంకెల సంఖ్యలోనే కొనసాగుతోందని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వహిస్తున్న నిశ్శబ్దాన్ని బద్ధలు కొట్టేందుకే తాము భారత్ జోడో యాత్ర చేస్తున్నామని చెప్పారు.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణంపై ప్రధాని మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది?’’ అని ఆయన నిలదీశారు. ఆగస్టులో 12.41 శాతానికి డబ్ల్యూపీఐ చేరింది. అలాగే, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.37 శాతానికి పెరిగింది. ఇందుకు సంబంధించి వచ్చిన వార్తను జైరాం రమేశ్ పోస్ట్ చేశారు.

ఆగస్టులో కూరగాయల ధరలు 22.37 శాతం పెరిగాయని, అలాగే, దేశంలో ఇంధనం, విద్యుత్తు ద్రవ్యోల్బణం 43.75 శాతం నుంచి తగ్గి 33.67 శాతానికి పరిమితమైందని అందులో ఉంది. దేశంలో తయారీ వస్తువుల, నూనె గింజల ద్రవ్యోల్బణం 7.51 శాతం, -13.48 శాతంగా ఉందని చెప్పారు. కాగా, ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ 9వ రోజు కొనసాగుతోంది. కేరళలో ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు.

Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదు