Lumpy Skin Disease: 57,000 పశువుల మృతిపై భారీ ఆందోళన చేపట్టిన బీజేపీ
ఈ వ్యాధి కారణంగా జైపూర్లో పాల ఉత్పత్తి తగ్గింది. దీంతో స్వీట్ల తయారికి పాలు లభించకపోవడంతో వ్యాపారాలు పడిపోతున్నాయి. రాజస్తాన్లో అతిపెద్ద పాల కో-ఆపరేటివ్ సొసైటీ అయిన జైపూర్ డైరీ ఫెడరేషన్ ఈ విషయమై మాట్లాడుతూ రాష్ట్రంలో 15-18 శాతం పాల ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. జైపూర్ డైరీ ఫెడరేషన్ ప్రతి రోజు 14 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంది. అయితే తాజా పరిణామాల వల్ల రోజుకు 12 లక్షల పాలు మాత్రమే సేకరిస్తున్నారట.

Big BJP Protest In Jaipur Over Lumpy Skin Disease
Lumpy Skin Disease: లుంపీ స్కిన్ మహమ్మారి కారణంగా రాజస్తాన్లో 57,000 పశువులు మరణించాయి, మరో 11 లక్షల పశువులు ఈ వ్యాధి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. కాగా, దీనిని నిరసిస్తూ రాజస్తాన్ రాజధాని జైపూర్ లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అయితే ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తమై కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఇక మరొక వైపు రాష్ట్ర అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తావనకు తెచ్చారు. బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా అసెంబ్లీ బయటికి ఒక ఆవును తీసుకువచ్చి లుంపీ స్కిన్ వ్యాధి ప్రభావాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.
అయితే లుంపీ స్కిన్ వ్యాధిని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ డిమాండ్ చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘‘లుంపీ స్కిన్ వ్యాధి నుంచి గోవులను ఎలా కాపాడాలోనని మా ప్రభుత్వం అత్యంత ప్రధాన్య అంశంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత తొందరలో వ్యాక్సీనో, మందులో తీసుకురావాలి. ఒకవేళ ఇది అంత తొందరగా సాధ్యం కాకపోతే వెంటనే ఈ వ్యాధిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి’’ అని అన్నారు.
ఈ వ్యాధి కారణంగా జైపూర్లో పాల ఉత్పత్తి తగ్గింది. దీంతో స్వీట్ల తయారికి పాలు లభించకపోవడంతో వ్యాపారాలు పడిపోతున్నాయి. రాజస్తాన్లో అతిపెద్ద పాల కో-ఆపరేటివ్ సొసైటీ అయిన జైపూర్ డైరీ ఫెడరేషన్ ఈ విషయమై మాట్లాడుతూ రాష్ట్రంలో 15-18 శాతం పాల ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. జైపూర్ డైరీ ఫెడరేషన్ ప్రతి రోజు 14 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంది. అయితే తాజా పరిణామాల వల్ల రోజుకు 12 లక్షల పాలు మాత్రమే సేకరిస్తున్నారట.
BJP Mayors conclave: చిన్న నగరాలను అభివృద్ధి చేసి, పెద్ద నగరాలపై భారం తగ్గించాలి: మోదీ