రూ. 850 కోట్ల విలువైన వస్తువును స్వాధీనం చేసుకున్న బీహార్ పోలీసులు.. అదేమిటంటే?

కాలిఫోర్నియం అత్యంత ఖరీదైన రేడియోధార్మిక పదార్థం. దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో గిరాకీ ఉంది. మార్కెట్ లో ఒక్కో గ్రాము విలువ దాదాపు ..

Radioactive Substance

Radioactive Substance : బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల అరుదైన కాలిఫోర్నియం రేడియోధార్మిక పదార్థంను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 850 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ మాట్లాడుతూ.. జిల్లాలో కొందరు వ్యక్తులు విలువైన వస్తువును అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం నిందితులను గుర్తించి, వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ తో పాటు వారి వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లు, 50 గ్రాముల కాలిఫోర్నియం రేడియోధార్మిక పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Also Read ; Telangana: బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్..

కాలిఫోర్నియం అత్యంత ఖరీదైన రేడియోధార్మిక పదార్థం. దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో గిరాకీ ఉంది. మార్కెట్ లో ఒక్కో గ్రాము విలువ దాదాపు రూ. 17కోట్లు ఉంటుంది. 50 గ్రాముల రాయి మొత్తం విలువ దాదాపు రూ. 850 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురు స్మగ్లర్లు ఛోటే లాల్ ప్రసాద్, చందన్ గుప్తా, కౌశల్య చౌక్ లను అదుపులోకి తీసుకోవటం జరిగిందని, వీరు కొద్ది నెలలుగా విలువైన వస్తువును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్పీ తెలిపారు.

Also Read : Manish sisodia : బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిసోడియా.. ప్రజలకు కీలక విజ్ఞప్తి

విలువైన కాలిఫోర్నియం రేడియోధార్మిక వస్తువును పరీక్షకోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. ఇదిలాఉంటే.. కాలిఫోర్నియం రేడియోధార్మిక పదార్థాన్ని న్యూక్లియర్ రియాకర్టర్లను ప్రారంభించేందుకు వాడుతారు. బొగ్గు విద్యుత్ ప్లాంట్లలో, క్యాన్సర్ చికిత్స, ఆయిల్ డ్రిల్లింగ్ కోసం ఈ అణుధార్మిక పదార్థాన్ని వాడనున్నట్లు అధికారులు తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు